Siddipet: అర్హులైన పిల్లలకు 100 శాతం వ్యాధి నిరోధక టీకాలు అందేలా చూడాలి!
Siddipet: సిద్దిపేట జిల్లా కోర్టు ఆవరణలోని డిస్పెన్సరీ, నాసర్పుర యూపీహెచ్సీని డీఎంహెచ్ఓ డాక్టర్ ధనరాజ్ బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేసి 100% టీకాలు వేయాలన్నారు.
Siddipet: అర్హులైన పిల్లలకు 100 శాతం వ్యాధి నిరోధక టీకాలు అందేలా చూడాలి!
సిద్దిపేట: సిద్దిపేట పట్టణంలోని జిల్లా కోర్టు ఆవరణంలో ఏర్పాటు చేసిన డిస్పెన్సరీని మరియు అర్బన్ UPHC నాసర్ పుర ఆరోగ్య కేంద్రాన్ని DMHO డాక్టర్ సి హెచ్ ధనరాజ్ ఆకస్మికంగా తనిఖీ నిర్వహించడం జరిగింది. డిస్పెన్సరీ మందుల లభ్యతా మరియు అక్కడకి వచ్చిన ప్రజలకు, అందుతున్న ఆరోగ్య సేవల గురించి అడిగి తెలుసుకున్నారు, రికార్డులను పరిశీలించారు. వైద్య అధికారులకు కొన్ని సలహాలు సూచనలు చేయడం జరిగింది.
UPHC నాసర్ పుర ఆరోగ్య కేంద్రాన్ని DMHO సందర్శించి ఉద్యోగుల హాజరు పట్టికను మరియు రికార్డ్లను పరిశీలించారు. అనంతరం అక్కడే నిర్వహిస్తున్న జాతీయ వ్యాధి నిరోధక టీకాల కార్యక్రమ పనితీరును, రికార్డులను పరిశీలించారు. అక్కడికి వచ్చిన లబ్ధిదారులకు టీకాలు ప్రాముఖ్యత గురించి అడిగి తెలుసుకుని కొన్ని సలహాలు సూచనలు ఇచ్చారు.
అనంతరం సిబ్బందికి కొన్ని సలహాలు సూచనలు పిల్లలకు 100% టీకాలు ఇప్పించేలా సిబ్బంది పనిచేయాలని, రికార్డులను ఎప్పటికప్పుడు U-win పోర్టల్ లో అప్డేట్ చేయాలని, ఆరోగ్య కేంద్రానికి వచ్చిన ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించాలని, అన్ని ఆరోగ్య కార్యక్రమాల పనితీరును మెరుగుపరుచుకోవాలని 100% లక్ష్యసాధనకై ప్రణాళికలు చేసుకోవాలని, గర్భిణీ స్త్రీల నమోదు దగ్గర్నుంచి సుఖ ప్రసవం అయ్యేంతవరకు ప్రత్యేక శ్రద్ధ వహించి ఆరోగ్య సలహాలు సూచనలు ఇవ్వాలని, అన్ని రకాల మందులను అందుబాటులో ఉంచుకోవాలని, సమయపాలన పాటించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ DMHO హుస్నాబాద్ Dr.శ్రీకాంత్ యాదవ్, వైద్యులు మెహ విష్ మరియు ఆరోగ్య సిబ్బంది ఆశా కార్యకర్తలను పాల్గొన్నారు.




