Siddipet: సురక్షితమైన ఆహారం ప్రతి పౌరుడి హక్కు..జిల్లా అధ్యక్షులు రవీందర్

Siddipet: ప్రపంచ ఆహార భద్రత దినోత్సవం సందర్భంగా వినియోగదారుల సంఘాల సమాఖ్య (క్యాట్కో) సిద్దిపేట జిల్లా అధ్యక్షులు కుంభాల రవీందర్ కీలక ప్రకటన విడుదల చేశారు.

Chindam Karunakar, Dubbak
Published on: 7 Jun 2026 7:54 AM IST
Siddipet
X

Siddipet: సురక్షితమైన ఆహారం ప్రతి పౌరుడి హక్కు..జిల్లా అధ్యక్షులు రవీందర్

సిద్దిపేట: ఆహార భద్రతపై సమాజమంతా బాధ్యత వహించాలి: కన్జ్యూమర్ అసోసియేషన్ సిద్దిపేట జిల్లా అధ్యక్షులు కుంభాల రవీందర్. సురక్షితమైన ఆహారం ప్రతి పౌరుడి హక్కు అని, ఆహార భద్రత విషయంలో ప్రభుత్వం, వ్యాపార వర్గాలు, వినియోగదారులు సమష్టిగా బాధ్యత వహించాలని తెలంగాణ రాష్ట్ర వినియోగదారుల సంఘాల సమాఖ్య (క్యాట్కో) కన్జ్యూమర్ అసోసియేషన్ సిద్దిపేట జిల్లా అధ్యక్షులు కుంభాల రవీందర్ అన్నారు.

ప్రపంచ ఆహార భద్రత దినోత్సవం సందర్భంగా ఆయన విడుదల చేసిన ప్రకటనలో మాట్లాడుతూ, ప్రతి సంవత్సరం ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) , ఆహార వ్యవసాయ సంస్థ (ఎఫ్ ఏ ఓ) సంయుక్తంగా ఈ దినోత్సవాన్ని నిర్వహిస్తున్నాయని తెలిపారు. ఈ ఏడాది “భారం నుండి పరిష్కారాల వరకు – ప్రతిచోటా సురక్షితమైన ఆహారం” అనే అంశంతో కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు.

ప్రపంచవ్యాప్తంగా పేద, అభివృద్ధి చెందుతున్న దేశాల్లో పోషకాహార లోపం, అసురక్షిత ఆహారం కారణంగా ప్రజల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం పడుతోందన్నారు. భారత ప్రభుత్వం జాతీయ ఆహార భద్రతా చట్టం ద్వారా ఉచిత బియ్యం, గోధుమలు, చిరుధాన్యాల పంపిణీ చేయాలి.

Chindam Karunakar, Dubbak

Chindam Karunakar, Dubbak

Next Story