Husnabad: వైభవంగా బంజారా తీజ్ ఉత్సవాలు పాల్గొన్న వొడితల సతీష్ కుమార్!

Husnabad: హుస్నాబాద్‌ పట్టణంలో బంజారా సోదరీమణులు ఘనంగా నిర్వహించిన తీజ్ ఉత్సవాల్లో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే వొడితల సతీష్ కుమార్.

SRINIVAS, HUSNABAD
Published on: 4 Sept 2026 11:54 AM IST
Husnabad
X

Husnabad: వైభవంగా బంజారా తీజ్ ఉత్సవాలు పాల్గొన్న వొడితల సతీష్ కుమార్!

Husnabad: హుస్నాబాద్ పట్టణంలో బంజారా సోదర, సోదరీమణులు ఘనంగా నిర్వహించిన తీజ్ ఉత్సవాల్లో హుస్నాబాద్ మాజీ శాసనసభ్యులు శ్రీ వొడితల సతీష్ కుమార్ పాల్గొన్నారు.

ఈ సందర్భంగా తీజ్ పండుగ విశిష్టతను, బంజారా సంస్కృతి, సంప్రదాయాల గొప్పతనాన్ని ఆయన కొనియాడారు. బంజారా మహిళలు సంప్రదాయ దుస్తుల్లో నిర్వహించిన తీజ్ వేడుకలు, సాంస్కృతిక కార్యక్రమాలను ఆసక్తిగా తిలకించారు.

బంజారా సమాజం అభివృద్ధికి, వారి హక్కులు మరియు సంక్షేమానికి ఎల్లప్పుడూ అండగా ఉంటామని సతీష్ కుమార్ తెలిపారు. ప్రతి ఒక్కరి జీవితాల్లో సుఖసంతోషాలు, ఆయురారోగ్యాలు, కుటుంబాల్లో ఆనందం వెల్లివిరియాలని ఆకాంక్షించారు.

ఈ కార్యక్రమంలో బంజారా సంఘం నాయకులు, మహిళలు, యువత, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

SRINIVAS, HUSNABAD

SRINIVAS, HUSNABAD