Mirudoddi: వరి కొయ్యలు తగలబెడుతూ మంటలు అంటుకుని రైతు దుర్మరణం!
Mirudoddi: సిద్దిపేట జిల్లా మిరుదొడ్డిలో విషాదం. వరి కొయ్యలను తగలబెడుతుండగా మంటల్లో చిక్కుకుని రైతు మద్దెల మల్లయ్య మృతి.
Mirudoddi: వరి కొయ్యలు తగలబెడుతూ మంటలు అంటుకుని రైతు దుర్మరణం!
Mirudoddi: వరి కొయ్యలను తగలబెట్టే క్రమంలో ప్రమాదవశాత్తు మంటల్లో చిక్కుకుని ఓ రైతు మృతి చెందిన ఘటన సిద్దిపేట జిల్లా మిరుదొడ్డిలో చోటుచేసు కుంది. స్థానికుల వివరాల ప్రకారం.. మిరుదొడ్డికి చెందిన మద్దెల మల్లయ్య (61) రెండు ఎకరాలలో వరి సాగు చేశాడు. పంట కోతలు పూర్తైన అనం తరం పొలంలోని వరి కొయ్యలను తగలబెడుతుం డగా ఒక్కసారిగా మంటలు చుట్టుపక్కల వ్యాపించాయి. దీంతో దట్టమైన పొగ కారణంగా ఊపిరాడక మల్లయ్య అక్కడి నుంచి బయటపడేందుకు ప్రయత్నించాడు.
గాలులు బలంగా వీయడంతో మంటలు మరింత వేగంగా వ్యాపించి మల్లయ్యను చుట్టుముట్టాయి. ఈ క్రమంలో ఆయన పొలంలోనే కుప్ప కూలి మంటల్లో చిక్కుకుని అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున్న మిరుదొడ్డి పోలీ సులు సంఘటన స్థలానికి చేరుకుని మృతదే^ పోస్టుమార్టం నిమిత్తం సిద్దిపేట ప్రభుత్వ త్రికి తరలించారు. మల్లయ్య భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ సతీష్ తెలిపారు.




