Siddipet: సిద్దిపేటలో విషాదం.. ధాన్యం కొనుగోలులో జాప్యం.. వడదెబ్బతో రైతు మృతి

Siddipet: సిద్దిపేటలో విషాదం.. ధాన్యం కొనుగోలు కేంద్రం వద్ద వడదెబ్బతో రైతు మృతి. వారం రోజులుగా వడ్ల రాశుల వద్దే కాపలా ఉన్న రైతు కిష్టారెడ్డి.

Chindam Karunakar, Dubbak
Published on: 27 May 2026 1:00 PM IST
Siddipet
X

Siddipet: సిద్దిపేటలో విషాదం.. ధాన్యం కొనుగోలులో జాప్యం.. వడదెబ్బతో రైతు మృతి

సిద్దిపేట జిల్లా: మిరుదొడ్డి మండల పరిధిలోని అందే గ్రామానికి చెందిన బయ్యారం కిష్టారెడ్డి (60) అనే రైతు వడదెబ్బకు గురై మృతి చెందిన ఘటన విషాదాన్ని నింపింది. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం..ప్రభుత్వం ధాన్యం కొనుగోలు చేయకపోవడంతో రైతు వారం రోజులుగా బీట్‌లో ఉన్న వడ్ల వద్దే ఉండాల్సి వచ్చింది. ఈ క్రమంలో తీవ్ర ఎండల కారణంగా వడదెబ్బకు గురైన కిష్టారెడ్డిని చికిత్స నిమిత్తం సిద్దిపేటలోని పీపుల్స్ హాస్పిటల్ కు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఈరోజు తెల్లవారుజామున మృతి చెందాడు. రైతు మృతితో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.

Chindam Karunakar, Dubbak

Chindam Karunakar, Dubbak

Next Story