Siddipet: ప్రభుత్వ పథకాలకు ఫార్మర్ ఐడి రిజిస్ట్రేషన్ తప్పనిసరి

Siddipet: ప్రభుత్వ పథకాల లబ్ధి కోసం ఫార్మర్ ఐడి రిజిస్ట్రేషన్ తప్పనిసరి. సెప్టెంబర్ 22 నుంచి 30 వరకు ప్రత్యేక నమోదు కార్యక్రమం చేపడుతున్నట్లు జేడీఏ వెల్లడి.

RAJU, SIDDIPET
Published on: 21 Sept 2026 10:27 PM IST
Siddipet
X

Siddipet: ప్రభుత్వ పథకాలకు ఫార్మర్ ఐడి రిజిస్ట్రేషన్ తప్పనిసరి

సిద్దిపేట: ప్రభుత్వ పథకాల ద్వారా రైతులకు, దాన్యం కొనుగోలు కోసం,,సబ్సిడీలు, PMKISSAN, రుణాలు పొందాలంటే ఫార్మర్ ఐడి రిజిస్ట్రేషన్ తప్పనిసరి* అని జిల్లా వ్యవసాయ అధికారి జె. స్వరూప రాణి తెలిపారు. జిల్లాలోని రైతులు తమ పరిధిలోని వ్యవసాయ విస్తరణ అధికారి లేదా దగ్గరలోని మీ సేవ కేంద్రాలను సంప్రదించి ఫార్మర్ ఐడి నమోదు చేసుకోవాలని ఆమె కోరారు.

సెప్టెంబర్ 22 నుంచి 30 2026 వరకు గ్రామాల వారీగా వ్యవసాయ విస్తరణ అధికారులు ఫార్మర్ ఐడి రిజిస్ట్రేషన్ చేపడతారని తెలిపారు. ఈ సందర్భంగా రైతులు తప్పనిసరిగా ఆధార్ కార్డు నెంబర్, పట్టాదార్ పాస్‌బుక్ వివరాలు, ఆధార్‌కు లింక్ అయిన మొబైల్ నెంబర్ తీసుకెళ్లాలని సూచించారు.

రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని జిల్లా వ్యవసాయ అధికారి తెలిపారు. ఆధార్‌కు లింక్ అయిన మొబైల్ నెంబర్‌కు ఎస్‌ఎంఎస్ వచ్చిన వెంటనే సంబంధిత వ్యవసాయ విస్తరణ అధికారి లేదా మీ సేవ కేంద్రాన్ని సంప్రదించాలని సూచించారు.

ఫార్మర్ ఐడి ద్వారా రైతుల వివరాలు ఖచ్చితంగా నమోదు అవుతాయని, తద్వారా పారదర్శకత పెరిగి ప్రభుత్వ పథకాలు వేగంగా అందుతాయని ఆమె అన్నారు. ఒకే ఐడి ద్వారా లబ్ధి నేరుగా బ్యాంకు ఖాతాలో జమ అవుతుందని, భవిష్యత్తు పథకాల ప్రయోజనాలు సులభంగా అందుతాయని తెలిపారు.

రైతులు మీ సేవ కేంద్రాల్లో కేవలం రూ.15 చెల్లించి రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చని, అలాగే రైతు వేదికలలో వ్యవసాయ విస్తరణ అధికారుల ద్వారా ఉచితంగా కూడా నమోదు చేసుకునే అవకాశం ఉందని తెలిపారు.

RAJU, SIDDIPET

RAJU, SIDDIPET