Siddipet: ధాన్యం కొనుగోళ్లలో అలసత్వంపై రైతుల ఆగ్రహం
Siddipet: సిద్దిపేట జిల్లా అక్బర్‌పేట భూంపల్లి చౌరస్తాలో రేపు రైతులు భారీ ధర్నా నిర్వహించనున్నారు.
Siddipet: ధాన్యం కొనుగోళ్లలో అలసత్వంపై రైతుల ఆగ్రహం
Siddipet: రైతులు ఆరుగాలం కష్టపడి పండించిన వరి ధాన్యం కొనడంలో తీవ్ర అలసత్వం ప్రదర్శిస్తున్న అధికారులు తీరుకు నిరసనగా రేపు సిద్దిపేట జిల్లా అక్బర్ పేట భూంపల్లి చౌరస్తాలో ధర్నా నిర్వహిస్తామని రైతులు హెచ్చరించారు.
గ్రేడ్ పేరుతో రైతులను మోసం చేయడం తగదని వెంటనే అధికారుల వేధింపులు మానుకోవాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. స్వచ్ఛందంగా నిర్వహిస్తున్న ఈ ధర్నా కార్యక్రమంలో పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని బొప్పాపూర్ సర్పంచ్ మాధవనేని భానుప్రసాద్ కోరారు.
Next Story




