Maddur: విద్యుత్ కోతలను నిరసిస్తూ సబ్ స్టేషన్ ముందు రైతుల ధర్నా!

Maddur: సిద్దిపేట జిల్లా మద్దూరు మండలం గాగిలాపూర్ సబ్ స్టేషన్ ముందు విద్యుత్ కోతలను నిరసిస్తూ బైఠాయించి ధర్నా చేసిన రైతులు.

CHANDRAREDDY,	CHERIYAL
Published on: 6 Oct 2026 2:00 PM IST
Maddur
X

Maddur: విద్యుత్ కోతలను నిరసిస్తూ సబ్ స్టేషన్ ముందు రైతుల ధర్నా!

Maddur: సిద్దిపేట జిల్లా మద్దూరు మండలంలోని గాగిలాపూర్ గ్రామంలో విద్యుత్ కోతలను నియంత్రించాలని అదనపు విద్యుత్ సౌకర్యం కల్పించాలని మంగళవారం రైతులు గాగిళ్ళాపూర్ సబ్ స్టేషన్ ముందు బైఠాయించి ధర్నా కార్యక్రమం చేపట్టారు.

ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ పంట చేతికొచ్చే సమయంలోపదే పదే విద్యుత్ కోతలు విధించడంతో పంట పొలాలకు నీరు అందక ఎండిపోయే పరిస్థితులు నెలకొన్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి వెంటనే రైతులకు సరిపడా విద్యుత్ అందించాలని కోరారు ఈ కార్యక్రమంలో రైతులు తదితరులు పాల్గొన్నారు.

CHANDRAREDDY,	CHERIYAL

CHANDRAREDDY, CHERIYAL