Siddipet: సిద్దిపేటలో రోడెక్కిన అన్నదాతలు.. గంటన్నర పాటు స్తంభించిన జాతీయ రహదారి!

Siddipet: సిద్దిపేట జిల్లా అక్బర్‌పేట భూంపల్లిలో వరి ధాన్యం కొనుగోళ్లలో జాప్యాన్ని నిరసిస్తూ రైతులు జాతీయ రహదారిపై ధర్నా చేపట్టారు.

Chindam Karunakar, Dubbak
Published on: 3 May 2026 12:46 PM IST
Siddipet
X

Siddipet: సిద్దిపేటలో రోడెక్కిన అన్నదాతలు.. గంటన్నర పాటు స్తంభించిన జాతీయ రహదారి!

సిద్దిపేట: గ్రేడ్ల పేరుతో అధికారులు రైతులను మోసం చేస్తున్నారంటూ అన్నదాతలు రోడెక్కిన సంఘటన సిద్దిపేట జిల్లాలో చోటు చేసుకుంది.సిద్దిపేట జిల్లా అక్బర్ పేట భూంపల్లి మండల కేంద్రంలోని ఎన్ హెచ్ హైవే చౌరస్తాపై రైతులు దాదాపు గంటన్నర పాటు ధర్నాకు దిగారు. ఈ ధర్నాకు బొప్పాపూర్ సర్పంచ్ మాధవనేని భాను ప్రసాద్ మద్దతు తెలుపుతూ రైతులతో పాటు ధర్నాలో పాల్గొన్నారు. రైతులు ధర్నా చేపట్టాడం వల్ల భారీగా వాహనాలు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి.గంటన్నర పాటు సంగారెడ్డి, సిద్దిపేట సిద్దిపేటకు వెళ్లె హైవే రైతులతో నిర్బంధమైంది.

అనంతరం బొప్పాపూర్ సర్పంచ్ భాను ప్రసాద్ మాట్లాడుతూ గత నెల రోజుల నుంచి ఐకెపి సెంటర్లో వడ్లు ఆరబోసి రైతులు ఎదురు చూస్తుంటే అధికారులు మాత్రం నిమ్మకు నీరెత్తినట్లు ప్రవర్తిస్తున్నారని,గ్రేడ్ల పేరుతో అధికారులు రైతులను మోసం చేస్తున్నారని, ఐకెపి సెంటర్లో రైతులకు సరైన సదుపాయాలు కల్పించాలని,వరి ధాన్యం వెంటనే కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. నాయకులు మాట్లాడుతూ గత నెల రోజుల నుండి రైతులు ఐకెపి సెంటర్ లోనే ఉండాల్సి వస్తుందని వెంటనే ప్రభుత్వం వరి ధాన్యం కొనుగోలు చేయాలని కోరారు.

Chindam Karunakar, Dubbak

Chindam Karunakar, Dubbak

Next Story