Peddagundavelli: వరి కొనుగోళ్ల కోసం సిద్దిపేట-మెదక్ హైవే దిగ్బంధం!

Peddagundavelli: సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం పెద్దగుండవెల్లి రైతులు వరి ధాన్యం కొనుగోలు చేయాలంటూ సిద్దిపేట-మెదక్ హైవే (NH 765D) పై భారీ ధర్నాకు దిగారు.

Chindam Karunakar, Dubbak
Published on: 19 May 2026 12:34 PM IST
Peddagundavelli
X

Peddagundavelli: వరి కొనుగోళ్ల కోసం సిద్దిపేట-మెదక్ హైవే దిగ్బంధం!

పెద్దగుండవెల్లి: వరి ధాన్యం కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ పెద్దగుండవెల్లి రైతులు ఆందోళన బాట పట్టారు. సిద్దిపేట-మెదక్ హైవే, ఎన్‌హెచ్ 765 డీజి రోడ్డుపై రైతులు బైఠాయించి ధర్నా నిర్వహిస్తున్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి కొనుగోలు ప్రక్రియ ప్రారంభించాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. ఈ ఆందోళన వల్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది.సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం, పెద్దగుండవెల్లి గ్రామ శివారు.

ఎన్‌హెచ్ 765, సిద్దిపేట-మెదక్ హైవేపై ఉద్రిక్త వాతావరణం నెలకొంది. వేలాది ఎకరాల్లో సాగు చేసిన వరి ధాన్యానికి మద్దతు ధర, వెంటనే కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని కోరుతూ స్థానిక రైతులు రోడ్డుపై ధర్నా చేపట్టారు. రైతుల ఆందోళనతో సిద్దిపేట నుండి మెదక్ వెళ్లే రాకపోకలు పూర్తిగా స్తంభించాయి. పోలీసులు రైతులతో చర్చలు జరుపుతున్నారు. అయితే, రైతులు మాత్రం తమ డిమాండ్లు నెరవేరే వరకు ధర్నా విరమించేది లేదని తేల్చి చెబుతున్నారు. వరి కొనుగోలు ప్రక్రియపై ప్రభుత్వం ఎప్పుడు స్పందిస్తుందో... రైతుల సమస్యలు ఎప్పుడు పరిష్కారమవుతాయో చూడాలి.

Chindam Karunakar, Dubbak

Chindam Karunakar, Dubbak

Next Story