Toguta: పంట వ్యర్థాలు కాల్చితే జరిమానా: రైతులకు వ్యవసాయ శాఖ హెచ్చరిక!

Toguta: సిద్దిపేట జిల్లా తొగుట మండలం బండారుపల్లిలో రైతులకు వ్యవసాయ శాఖ అవగాహన. వానాకాలంలో 50% సన్నరకం వడ్ల సాగు, పంట అవశేషాల నిర్వాహణపై అధికారుల సూచనలు.

Chindam Karunakar, Dubbak
Published on: 30 May 2026 11:03 AM IST
Toguta
X

Toguta: పంట వ్యర్థాలు కాల్చితే జరిమానా: రైతులకు వ్యవసాయ శాఖ హెచ్చరిక!

Toguta: రైతులు వానా కాలం సాగులో 50 శాతం సన్నరకం వడ్లు సాగు చేయాలని మండల వ్యవసాయ అధికారి మోహా న్ సూచించారు. సిద్దిపేట జిల్లా తొగుట మండలం బండారుపల్లి గ్రామంలో వానాకాలం పంటలపై రైతులకు అవగాహన కల్పించి మాట్లాడారు. పంట అవశేషాలను కాల్చడంతో నేలలోని సేంద్రీయ కర్బనం నత్రజని, భాస్వరం, పొటాష్తో పాటు సూక్ష్మపోషకాలు నశించి భూమి నిస్సా రంగా మారుతుందన్నారు. పంట అవశేషాలు కాల్చడం వల్ల అగ్ని ప్రమాదాలు జరుగుతున్నా యని సూచించారు. పంట అవశేషాల నిర్వాహణకు రైతులు ప్రత్యామ్నాయ పద్దతులు అనుస రించాలన్నారు. పర్యావరణ పరిరక్షణ చట్టం రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీవో 27 ప్రకారం పంట అవశేషాలను కాల్చడం నిషేదమన్నారు. పంట అవశేషాలను కాల్చినచో రూ. 5వేల వరకు జరిమానా విధించడం జరుగుతుందన్నారు. రైతులు రసాయనిక ఎరువులు తగ్గించి సేంద్రీయ ఎరువుల్ని వినియోగించినట్లయితే భూసారం పెరిగి రసాయనిక ఎరువుల అవసరం తగ్గుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ కోల వెంకటస్వామిగౌడ్, ఏఈవో నాగార్జున, రైతులు పాల్గొన్నారు.

Chindam Karunakar, Dubbak

Chindam Karunakar, Dubbak

Next Story