Dubbaka: రైతులు ధాన్యం కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలి!
Dubbaka: సిద్దిపేట జిల్లా దుబ్బాక మార్కెట్ కమిటీ చైర్మన్ కొంగరి రవి రైతులకు సూచన. ఐకేపీ ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో సన్న వడ్లకు క్వింటాల్‌కు రూ.500 బోనస్ పొందాలని విజ్ఞప్తి.
Dubbaka: రైతులు ధాన్యం కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలి!
Dubbaka: సిద్దిపేట జిల్లా దుబ్బాక రైతులు తాము పండించిన ధాన్యాన్ని దళారులకు విక్రయించి నష్టపోకుండా, ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న ధాన్యం కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలని దుబ్బాక మార్కెట్ కమిటీ చైర్మన్ కొంగరి రవి సూచించారు.
రైతులకు ధాన్యం విక్రయాల్లో ఎలాంటి ఇబ్బందులు ఎదురుకాకుండా,పంటకు ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర పొందేందుకు కొనుగోలు కేంద్రాలు ఎంతగానో ఉపయోగపడతాయని పేర్కొన్నారు.
ధాన్యం విక్రయించే సమయంలో రైతులు ప్రభుత్వం నిర్దేశించిన నిబంధనలను పాటించాలని, కొనుగోలు కేంద్రాల్లో అందుబాటులో ఉన్న సేవలను వినియోగించుకోవాలని తెలిపారు. రైతులకు అవసరమైన సహకారం అందించాలని ఐకేపీ సిబ్బందికి సూచించారు.
తెలంగాణ ప్రభుత్వం సన్న వడ్లకు క్వింటాల్‌కు రూ.500 బోనస్ అందిస్తోందని తెలిపారు. కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం సేకరించిన అనంతరం అధికారులు ఆన్‌లైన్ ట్యాబ్‌లో లేదా ట్రక్ షీట్‌లో సంబంధిత వివరాలను నమోదు చేస్తారని పేర్కొన్నారు.




