Daulatabad: ధాన్యం అన్లోడింగ్ నిలిపివేత.. దౌల్తాబాద్‌లో రోడ్డెక్కిన అన్నదాతలు!
Daulatabad: సిద్దిపేట జిల్లా దౌల్తాబాద్‌లో ధాన్యం అన్లోడింగ్ నిలిపివేతపై రైతుల రాస్తారోకో. తిరుమల కాటన్ మిల్లు వద్ద నిరసన.
Daulatabad: ధాన్యం అన్లోడింగ్ నిలిపివేత.. దౌల్తాబాద్‌లో రోడ్డెక్కిన అన్నదాతలు!
సిద్దిపేట జిల్లా: దౌల్తాబాద్ మండలం లోని హైమద్ నగర్ శివారులో తిరుమల కాటన్ మిల్లు వద్ద ధాన్యం అన్లోడింగ్ నిలిపివేతతో రైతులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ గజ్వేల్-దౌల్తాబాద్ ప్రధాన రహదారిపై రాస్తారో కోకు దిగారు. మండలంలోని పలు గ్రామాలకు చెందిన రైతులు తమ ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాల నుంచి సదరు మిల్లుకు తరలించగా, నిల్వ చేసే కిరాయి విషయంలో అసంతృప్తి వ్యక్తం చేసిన యాజమాన్యం అన్లోడింగ్ ప్రక్రియను అకస్మా త్తుగా నిలిపివేసింది.
దీంతో లారీలు, ట్రాక్టర్లలో ధాన్యం తీసుకొచ్చిన రైతులు గంటల తరబడి అక్కడే వేచి ఉండాల్సి రావడంతో అసహనానికి లోనయ్యారు. దీంతో రైతలుఉ ప్రధాన రహదారిపై బైఠాయించడంతో వాహనాల రాకపోకలు స్తంభించి ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. సమాచారం అందుకున్న ఎస్ఐ అరుణ్ కుమార్ అక్కడికి చేరుకుని రైతులకు నచ్చజెప్పి, మిల్లు యాజమాన్యంతో చర్చించి, అన్లోడింగ్ ప్రక్రి యను ప్రారంభింపజేయడంతో రైతులు ఆందోళన విరమించారు.




