Siddipet: రైతుకు తప్పని కష్టం.. అగ్నికి ఆహుతైన నీలగిరి పంట!
Siddipet: సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం రామక్కపేటలో అగ్ని ప్రమాదం. అంజయ్య అనే రైతుకు చెందిన నీలగిరి తోట పూర్తిగా దగ్ధం.
Siddipet: రైతుకు తప్పని కష్టం.. అగ్నికి ఆహుతైన నీలగిరి పంట!
సిద్దిపేట జిల్లా: దుబ్బాక మండలం రామక్కపేటలో ప్రమాదవశాత్తు అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. రైతుకు చెందిన నీలగిరి తోట అగ్నికి ఆహుతైంది. సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం రామక్కపేట శివారులో గురువారం ప్రమాదవశాత్తు నిప్పంటుకుని సాలివెరి అంజయ్య అనే రైతుకు చెందిన నీలగిరి తోట పూర్తిగా దగ్ధమైంది. విషయం తెలుసుకున్న స్థానికులు వెంటనే అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ ప్రమాదంలో లక్షల రూపాయల ఆస్తి నష్టం వాటిల్లినట్లు రైతు ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.వేసవి కాలం కావడంతో రైతులు అగ్ని ప్రమాదాల పట్ల అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.
Next Story




