Siddipet: అంబేద్కర్ జాతీయ అవార్డుకు ఎంపికైన జానపద కళాకారుడు మల్లన్న!

Siddipet: సిద్దిపేట జిల్లాకు చెందిన ప్రముఖ జానపద కళాకారుడు బండమీది మల్లన్నకు డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ నేషనల్ అవార్డు-2026.

Chindam Karunakar, Dubbak
Updated on: 19 Jun 2026 10:47 AM IST
Siddipet
X

Siddipet: అంబేద్కర్ జాతీయ అవార్డుకు ఎంపికైన జానపద కళాకారుడు మల్లన్న!

సిద్దిపేట జిల్లా: అక్బర్‌పేట్-భూంపల్లి మండలంలోని బొప్పాపూర్ గ్రామానికి చెందిన ప్రముఖ జానపద కళాకారుడు, సామాజిక ఉద్యమకారుడు, ప్రజా చైతన్యవేత్త బండమీది మల్లన్న గారు ప్రతిష్ఠాత్మక డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ నేషనల్ అవార్డు 2026"కు ఎంపికయ్యారు.

సామాజిక న్యాయం, కళారంగ సేవలు, అంబేద్కర్ ఆశయాల ప్రచారం, వెనుకబడిన వర్గాల అభ్యున్నతికి చేసిన విశిష్ట కృషిని గుర్తించి ఈ అవార్డును ప్రదానం చేయనున్నట్లు బహుజన సాహిత్య అకాడమీ (BSA) ప్రకటించింది.

హైదరాబాద్‌లోని బహుజన సాహిత్య అకాడమీ జాతీయ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో అకాడమీ జాతీయ అధ్యక్షులు నల్లా రాధాకృష్ణ గారు మల్లన్నకు అవార్డు ఆహ్వాన పత్రాన్ని అందజేశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీల సామాజిక, సాంస్కృతిక, సాహిత్య, ఉద్యమ రంగాలలో విశిష్ట సేవలు అందిస్తున్న వ్యక్తులను గుర్తించి ప్రతి సంవత్సరం జాతీయ అవార్డులను అందజేస్తున్నామని తెలిపారు.

Chindam Karunakar, Dubbak

Chindam Karunakar, Dubbak

Next Story