Husnabad: హుస్నాబాద్‌లో ఆదివారం బీఆర్ఎస్ కీలక సమావేశం!
Husnabad: హుస్నాబాద్‌లో సెప్టెంబర్ 2 నుంచి 9 వరకు చేపట్టే బీఆర్ఎస్ కార్యక్రమాలపై మాజీ ఎమ్మెల్యే వొడితల సతీష్ కుమార్ అధ్యక్షతన ఆదివారం కీలక సమావేశం.
Husnabad: హుస్నాబాద్‌లో ఆదివారం బీఆర్ఎస్ కీలక సమావేశం!
హుస్నాబాద్: సిద్దిపేట జిల్లా సెప్టెంబర్ 2 నుంచి 9వ తేదీ వరకు హుస్నాబాద్ నియోజకవర్గంలో నిర్వహించనున్న బీఆర్ఎస్ కార్యక్రమాలపై ఆదివారం ఉదయం 10 గంటలకు నియోజకవర్గ స్థాయి ముఖ్య నాయకుల సమావేశం నిర్వహించనున్నారు. హుస్నాబాద్లోని మాజీ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో సమావేశం జరగనుంది. మాజీ ఎమ్మెల్యే వొడితల సతీష్ కుమార్ ముఖ్యఅతిథిగా హాజరై పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేయనున్నారు.
సెప్టెంబర్ 2 నుంచి 9 వరకు చేపట్టాల్సిన కార్యక్రమాలు, పార్టీ కార్యాచరణపై సమావేశంలో చర్చించి నిర్ణయాలు తీసుకోనున్నారు. సమావేశానికి మాజీ మండల అధ్యక్షులు, మాజీ జెడ్పీటీసీలు, మాజీ ఎంపీపీలు, ప్రస్తుత, మాజీ మున్సిపల్ కౌన్సిలర్లు, రైతు సమన్వయ సమితి మాజీ అధ్యక్షులు, సభ్యులు, ప్రస్తుత, మాజీ ప్రజాప్రతినిధులు, నియోజకవర్గ, మండల, సర్పంచులు, ఉపసర్పంచులు, వార్డు సభ్యులు, గ్రామస్థాయి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు హాజరు కావాలని పార్టీ వర్గాలు కోరాయి.




