Siddipet: రాయపోల్ మాజీ ఎంపీటీసీ దత్తరెడ్డి మృతి పై నివాళులు
Siddipet: రాయపోల్ మాజీ ఎంపీటీసీ దత్తరెడ్డి మరణంపై దరువు అంజన్న నివాళులు అర్పించి సంతాపం వ్యక్తం చేశారు.
సిద్దిపేట
Siddipet: సిద్దిపేట జిల్లా రాయపోల్ మాజీ ఎంపీటీసీ దత్తరెడ్డి గుండెపోటుతో మృతి చెందడం పట్ల రాష్ట్ర భాషా సంస్కృతిక సలహాదారులు దరువు అంజన్న తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా రాయపోల్ మండల కేంద్రంలోని దత్తరెడ్డి నివాసానికి వెళ్లి ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. 1995లో రాయపోల్ తొలి ఎంపీటీసీగా ఎన్నికై ప్రజలకు నిస్వార్థ సేవలు అందించిన విషయాన్ని గుర్తు చేసుకున్నారు.
గ్రామ అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలులో దత్తరెడ్డి కీలక పాత్ర పోషించారని పేర్కొన్నారు. నిరుపేదలకు సేవలు అందిస్తూ ప్రజలతో కలిసిమెలిసి పనిచేసిన నాయకుడని కొనియాడారు.
దత్తరెడ్డి మృతి పట్ల సంతాపం వ్యక్తం చేస్తూ, రాజకీయాల్లో నిస్వార్థంగా సేవ చేసిన నాయకుల కోల్పోవడం బాధాకరమని తెలిపారు.
Next Story




