Siddipet: అభివృద్ధి చేసి అప్పుల పాలయ్యాం.. బిల్లులు ఇవ్వకపోతే ఊరుకోం!
Siddipet: మాజీ సర్పంచుల బకాయి బిల్లులను తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ జూన్ 1న సీఎం రేవంత్ రెడ్డి క్యాంప్ కార్యాలయం ముట్టడికి పిలుపునిచ్చారు.
Siddipet: అభివృద్ధి చేసి అప్పుల పాలయ్యాం.. బిల్లులు ఇవ్వకపోతే ఊరుకోం!
Siddipet: మాజీ సర్పంచుల బకాయి బిల్లులను ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ అందుకు నిరసనగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి క్యాంప్ కార్యాలయం ముట్టడిని విజయవంతం చేయాలని సిద్దిపేట జిల్లా తొగుట మండల మాజీ సర్పంచులు మంగ రేణుక నర్సింలు బిక్కునూరి రజిత శ్రీశైలం గారితో కలిసి బొడ్డు నరసింహులు యాదవ్ తొగుట మండల కేంద్రంలో మాట్లాడుతూ మాజీ సర్పంచుల బిల్లులు వెంటనే విడుదల చేయాలని లేని పక్షంలో సీఎం క్యాంప్ కార్యాలయం ముట్టడి చేస్తామని జూన్ 1వ తారీఖు నాడు మాజీ సర్పంచ్ అందరూ కలిసి ముట్టడిస్తామని హెచ్చరించారు. సర్పంచుల పదవీకాలం ముగిస్తూ రెండున్నర సంవత్సరాలు గడుస్తున్న నూతన సర్పంచులు వచ్చి ఆరు నెలలు గడుస్తున్న ఇప్పటికీ బిల్లులు చెల్లించకపోవడం చాలా బాధాకరమని అన్నారు తెలంగాణ వ్యాప్తంగా గ్రామపంచాయతీలలో అభివృద్ధి కార్యక్రమాలు చేసి అప్పుల పాలైన మాజీ సర్పంచుల బాధలు వర్ణనాతీతామని అన్నారు.




