Dubbak: దుబ్బాక ప్రభుత్వ కళాశాల విద్యార్థులకు ఉచితంగా బ్యాగుల పంపిణీ!
Dubbak: సిద్దిపేట జిల్లా దుబ్బాక ప్రభుత్వ కళాశాలల విద్యార్థులకు ఉచితంగా బ్యాగుల పంపిణీ. చెరుకు ముత్యంరెడ్డి కిసాన్ సేవా సమితి ఆధ్వర్యంలో కార్యక్రమం.
Dubbak: దుబ్బాక ప్రభుత్వ కళాశాల విద్యార్థులకు ఉచితంగా బ్యాగుల పంపిణీ!
Dubbak: విద్యార్థుల మెరుగైన భవిష్యత్తుకు చెరుకు ముత్యంరెడ్డి కిసాన్ సేవా సమితి తోడ్పాటునందిస్తుందని కాంగ్రెస్ పార్టీ దుబ్బాక నియోజకవర్గ ఇంచార్జి చెరుకు శ్రీనివాస్ రెడ్డి అన్నారు. సిద్దిపేట జిల్లా దుబ్బాక ప్రభుత్వ జూనియర్ కళాశాల, డిగ్రీ కళాశాల విద్యార్థులకు చెరుకు ముత్యంరెడ్డి జ్ఞాపకార్థం ఉచితంగా 583 బ్యాగులను పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముత్యంరెడ్డి మాజీ మంత్రిగా దుబ్బాక నియోజకవర్గ అభివృద్ధి కోసం ఎంతగానో కృషి చేశారని గుర్తు చేశారు. గ్రామీణ పేద విద్యార్థుల ఉన్నత భవిష్యత్తు కోసం ప్రభుత్వ కళాశాల బలోపేతానికి కృషి చేసిన మహనీయుడు చెరుకు ముత్యంరెడ్డి అని కొనియాడారు. ముత్యంరెడ్డి చూపిన స్ఫూర్తితో నియోజకవర్గ అభివృద్ధికి తన వంతుగా కృషి చేస్తున్నానని వెల్లడించారు.




