Dubbaka: దుబ్బాకలో ఫ్రీ పోలీస్ కోచింగ్ పోస్టర్ ఆవిష్కరించిన ఎస్సై సృజన!

Dubbaka: తెలంగాణ రాష్ట్రంలో పోలీస్ కొలువే లక్ష్యంగా శ్రమిస్తున్న నిరుద్యోగ యువతీ యువకులకు అఖిలారాజ్ ఫౌండేషన్ ఒక అద్భుతమైన అవకాశాన్ని ముందుకు తెచ్చింది.

Chindam Karunakar, Dubbak
Published on: 27 Jun 2026 7:16 AM IST
Dubbaka
X

Dubbaka: దుబ్బాకలో ఫ్రీ పోలీస్ కోచింగ్ పోస్టర్ ఆవిష్కరించిన ఎస్సై సృజన!

దుబ్బాక/నార్సింగ్: అఖిలారాజ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఎస్సై కానిస్టేబుల్ ఫ్రీ కోచింగ్ సెంటర్ నిర్వహణ దుబ్బాక నియోజకవర్గం నార్సింగ్ పోలీస్ స్టేషన్ లో ఎస్సై సృజన చేతుల మీదుగా అఖిల రాజ్ ఫౌండేషన్ మరియు శ్రీధర్ కాలేజ్ ఆఫ్ కాంపిటీటివ్ కోచింగ్ సెంటర్ స్కాలర్షిప్ టెస్ట్ నిర్వహణ కార్యక్రమం పోస్టర్ ఆవిష్కరణ చేయడం జరిగింది. తెలంగాణ రాష్ట్రంలో రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసేటటువంటి ఎస్సై మరియు కానిస్టేబుల్ పోస్టులకు అర్హులైన నిరుద్యోగులు ఈ ఫౌండేషన్ అందించే ఫ్రీ కోచింగ్ సెంటర్ ను సద్వినియోగం చేసుకోగలరని ఎస్సై శ్రీ సృజన గారు తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో అఖిలా రాజ్ ఫౌండేషన్ నాయకులు కార్యకర్తలు పాల్గొని నిరుద్యోగులకు మంచి అవకాశం గా ఉంటుంది కాబట్టి నిరుద్యోగ యువతీ యువకులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలరని కోరడమైనది.

Chindam Karunakar, Dubbak

Chindam Karunakar, Dubbak

Next Story