Gajwel: ఆలియాబాద్‌లో హంస హోమియోపతి ఉచిత వైద్య శిబిరం!

Gajwel: సిద్దిపేట జిల్లా గజ్వేల్ పరిధిలోని ఆలియాబాద్ మున్సిపల్ కార్యాలయంలో హంస హోమియోపతి మెడికల్ కాలేజ్ ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం విజయవంతంగా నిర్వహించారు.

MEER OSMAN ALI KHAN, GAJEWL
Published on: 11 Nov 2026 7:51 PM IST
Gajwel
X

Gajwel: ఆలియాబాద్‌లో హంస హోమియోపతి ఉచిత వైద్య శిబిరం!

Gajwel: ఆలియాబాద్‌లో హంస హోమియోపతి మెడికల్ కాలేజ్, హాస్పిటల్ అండ్ రీసెర్చ్ సెంటర్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఉచిత మెగా హోమియోపతి వైద్య శిబిరానికి విశేష స్పందన లభించింది. బుధవారం మున్సిపల్ కార్యాలయంలో నిర్వహించిన ఈ శిబిరంలో సుమారు 120 మందికి ఉచిత వైద్య పరీక్షలు, ల్యాబొరేటరీ టెస్టులు, వైద్య సంప్రదింపులు నిర్వహించి అవసరమైన మందులను పంపిణీ చేశారు.

మున్సిపల్ చైర్‌పర్సన్ కాంతం శ్వేత శిరీష కృష్ణారెడ్డి రిబ్బన్ కట్ చేసి శిబిరాన్ని ప్రారంభించగా, మున్సిపల్ కమిషనర్ ఎన్. వెంకట్ రెడ్డి పాల్గొన్నారు. ముఖ్యంగా సీజనల్ వ్యాధులు, శ్వాసకోశ సంబంధిత సమస్యలపై ప్రజలకు వైద్య సేవలతో పాటు అవగాహన కల్పించారు.

కళాశాల డైరెక్టర్ డాక్టర్ ఉమేష్ అక్కలదేవి ఆధ్వర్యంలో, ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ డాక్టర్ కె. శ్రీనివాస్ బాబు పర్యవేక్షణలో, వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ పి.వి. సాయి సంతోష్ కిరణ్ సమన్వయంతో శిబిరం నిర్వహించారు. పీజీ వైద్య విద్యార్థులు, ఇంటర్న్ వైద్యులు రోగులకు ప్రాథమిక ఆరోగ్య పరీక్షలు నిర్వహించి తగిన వైద్య సలహాలు అందించారు.

ఈ సందర్భంగా మున్సిపల్ చైర్‌పర్సన్, కమిషనర్ మాట్లాడుతూ ప్రజల ఆరోగ్య పరిరక్షణ కోసం ఉచిత వైద్య శిబిరాలు నిర్వహించడం అభినందనీయమని పేర్కొన్నారు. పట్టణ, గ్రామీణ ప్రాంతాల ప్రజలకు ఇటువంటి సేవా కార్యక్రమాలు ఎంతో ఉపయోగకరంగా ఉంటాయని తెలిపారు.

శిబిరం విజయవంతం కావడానికి సహకరించిన మున్సిపల్ పాలకవర్గం, అధికారులు, కళాశాల యాజమాన్యం, అధ్యాపకులు, పీజీ విద్యార్థులు, ఇంటర్న్ వైద్యులకు డైరెక్టర్ డాక్టర్ ఉమేష్ అక్కలదేవి, ప్రిన్సిపాల్ డాక్టర్ కె. శ్రీనివాస్ బాబు కృతజ్ఞతలు తెలిపారు. ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందిస్తూ ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణానికి కృషి చేయడమే తమ లక్ష్యమని నిర్వాహకులు పేర్కొన్నారు.

MEER OSMAN ALI KHAN, GAJEWL

MEER OSMAN ALI KHAN, GAJEWL