Gajwel: గజ్వేల్ ట్రాఫిక్ పిఎస్‌ను ఆకస్మికంగా తనిఖీ చేసిన సీపీ రష్మీ పెరుమాళ్

Gajwel: గజ్వేల్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్‌ను సీపీ రష్మీ పెరుమాళ్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. రికార్డుల నిర్వహణ, ట్రాఫిక్ నియంత్రణపై సిబ్బందికి దిశానిర్దేశం చేశారు.

MEER OSMAN ALI KHAN, GAJEWL
Published on: 30 Oct 2026 11:43 PM IST
Gajwel
X

Gajwel: గజ్వేల్ ట్రాఫిక్ పిఎస్‌ను ఆకస్మికంగా తనిఖీ చేసిన సీపీ రష్మీ పెరుమాళ్

గజ్వేల్: సిద్దిపేట పోలీస్ కమిషనర్ రష్మీ పెరుమాళ్, ఐపీఎస్ శుక్రవారం గజ్వేల్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్‌ను ఆకస్మికంగా సందర్శించి తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పోలీస్ స్టేషన్ ఆవరణను పరిశీలించడంతో పాటు కార్యాలయ రికార్డులు, రిజిస్టర్లను తనిఖీ చేశారు. సిబ్బందితో మాట్లాడి వారి విధి నిర్వహణ, ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు.

అనంతరం ట్రాఫిక్ ఇన్‌స్పెక్టర్ సత్యనారాయణతో పాటు సిబ్బందికి పలు సూచనలు చేశారు. స్టేషన్‌కు సంబంధించిన రికార్డులను ఎప్పటికప్పుడు అప్‌డేట్‌గా ఉంచాలని, పరిసరాలను పరిశుభ్రంగా నిర్వహించాలని ఆదేశించారు. గజ్వేల్ పట్టణంలో ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా సమర్థవంతమైన ప్రణాళికతో విధులు నిర్వహించాలని, ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించే వారిపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని సూచించారు.

ఈ తనిఖీలో గజ్వేల్ ఏసీపీ నరసింహులు, ట్రాఫిక్ ఇన్‌స్పెక్టర్ సత్యనారాయణ, ట్రాఫిక్ ఎస్‌ఐ నీరేష్, ఇతర పోలీస్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

MEER OSMAN ALI KHAN, GAJEWL

MEER OSMAN ALI KHAN, GAJEWL