Gajwel: వినాయక నిమజ్జనంలో విషాదం: డీజే ఆపరేటర్ మృతి!

Gajwel: సిద్దిపేట జిల్లా గజ్వేల్ మండలం సింగాటంలో విషాదం వినాయక నిమజ్జనంలో డీజే ఆపరేట్ చేస్తూ కుప్పకూలి 22 ఏళ్ల యువకుడు దినేష్ మృతి.. కేసు నమోదు చేసిన పోలీసులు.

MEER OSMAN ALI KHAN, GAJEWL
Published on: 28 Sept 2026 10:48 PM IST
Gajwel
X

Gajwel: వినాయక నిమజ్జనంలో విషాదం: డీజే ఆపరేటర్ మృతి!

గజ్వేల్: వినాయక నిమజ్జన వేడుకల్లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. డీజే సౌండ్ ఆపరేటింగ్ చేస్తూ ఒక యువకుడు ఆకస్మికంగా కుప్పకూలి మృతి చెందిన సంఘటన గజ్వేల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని సింగాటం గ్రామంలో ఆదివారం రాత్రి జరిగింది.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కొలుగూరు గ్రామానికి చెందిన బండారి దినేష్ (22), తండ్రి కృష్ణయ్య, ఆదివారం (సెప్టెంబర్ 27) రాత్రి సింగాటం గ్రామంలో జరుగుతున్న వినాయక నిమజ్జన ఊరేగింపులో డీజే ఆపరేటర్‌గా వ్యవహరిస్తున్నాడు. కాగా, ఈ నిమజ్జన కార్యక్రమానికి నిర్వాహకులు ఎలాంటి ముందస్తు పోలీసు అనుమతి లేకుండానే డీజే ఏర్పాటు చేసినట్లు తెలిసింది.

రాత్రి సుమారు 9 గంటల ప్రాంతంలో డీజే ఆపరేట్ చేస్తూ దినేష్ ఒక్కసారిగా స్పృహతప్పి కిందపడిపోయాడు. గమనించిన స్థానికులు వెంటనే అతనికి సీపీఆర్ (CPR) చేసి, ప్రాథమిక చికిత్స అందించే ప్రయత్నం చేశారు. అనంతరం చికిత్స నిమిత్తం స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే, ఆసుపత్రిలో పరీక్షించిన వైద్యులు దినేష్ అప్పటికే మృతి చెందినట్లు ధృవీకరించారు. డీజే శబ్దాల ఉధృతికి గుండెపోటు వచ్చి ఉండవచ్చని అనుమానిస్తున్నారు.

ఈ ఘటనపై గజ్వేల్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నారు. యువకుడి అకాల మరణంతో కొలుగూరు, సింగాటం గ్రామాల్లో తీవ్ర విషాద ఛాయలు అలముకున్నాయి.

MEER OSMAN ALI KHAN, GAJEWL

MEER OSMAN ALI KHAN, GAJEWL