Siddipet: గ్రామ పెద్ద ఓలపు గోపయ్య మరణం బాధాకరం: జీడిపల్లి రాంరెడ్డి
Siddipet: వెంకట్రావుపేట గ్రామానికి చెందిన ప్రముఖ గ్రామ పెద్ద ఓలపు గోపయ్య మృతి పట్ల బీఆర్ఎస్ మండల అధ్యక్షులు జీడిపల్లి రాంరెడ్డి, సర్పంచ్ ఘన నివాళులర్పించారు.
Siddipet: గ్రామ పెద్ద ఓలపు గోపయ్య మరణం బాధాకరం: జీడిపల్లి రాంరెడ్డి
iddipet: సిద్దిపేట జిల్లా తొగుట మండలం వెంకట్రావుపేట గ్రామానికి చెందిన గ్రామ పెద్ద ఓలపు సత్యనారాయణ గారి తండ్రి ఓలపు గోపయ్య (85) గారి మరణం అత్యంత బాధాకరమని బీఆర్ఎస్ తొగుట మండల అధ్యక్షులు జీడిపల్లి రాంరెడ్డి అన్నారు.
గోపయ్య కన్నుమూయగా, గ్రామ సర్పంచ్ బండారి కవిత స్వామి గౌడ్ తో కలిసి ఆయన భౌతిక కాయానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా గోపయ్య గారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేసి, ధైర్యంగా ఉండాలని ఓదార్చారు.
ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు డబ్బికారి పెంటోజీ, సింగోజి కృష్ణ, కనకరాజు, సుతారి రాంబాబు తదితరులు పాల్గొని గోపయ్య గారి చిత్రపటానికి నివాళులర్పించి, వారి కుటుంబ సభ్యులకు సంతాపం తెలిపారు.
Next Story




