Husnabad: అనభేరి స్మారక పార్కుకు రూ.2.30 కోట్లు.. మంత్రి పొన్నంకు కృతజ్ఞతలు!
Husnabad: అమరవీరుడు అనభేరి ప్రభాకర్ రావు స్మారక పార్కుకు రూ.2.30 కోట్లు మంజూరు చేయడంపై హుస్నాబాద్ మహమ్మదాపూర్ గుట్టల్లో సభ నిర్వహించి మంత్రి పొన్నంకు కృతజ్ఞతలు తెలిపారు.
Husnabad: అనభేరి స్మారక పార్కుకు రూ.2.30 కోట్లు.. మంత్రి పొన్నంకు కృతజ్ఞతలు!
హుస్నాబాద్: తెలంగాణ సాయుధ పోరాట యోధుడు, అమరవీరుడు అనభేరి ప్రభాకర్ రావు స్మారక పార్కు, పర్యాటక అభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వం రూ.2.30 కోట్ల నిధులు మంజూరు చేయడంపై ప్రజా సంఘాల ఐక్య వేదిక హర్షం వ్యక్తం చేసింది. నిధుల మంజూరుకు కృషి చేసిన హుస్నాబాద్ ఎమ్మెల్యే, రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్‌కు కృతజ్ఞతలు తెలిపింది.
ఈ మేరకు ప్రజా సంఘాల ఐక్య వేదిక నిర్వాహకులు మార్క అనిల్ కుమార్ గౌడ్ ఆధ్వర్యంలో మహమ్మదాపూర్ గుట్టల్లోని అనభేరి ప్రభాకర్ రావు స్మారక మందిరం వద్ద కృతజ్ఞతా సభ నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ.. నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా అనభేరి ప్రభాకర్ రావు సాగించిన వీరోచిత పోరాటం, చేసిన త్యాగాలు చిరస్మరణీయమని పేర్కొన్నారు. అమరవీరుల చరిత్రను భావితరాలకు తెలియజేసేలా స్మారక పార్కు, పర్యాటక అభివృద్ధికి నిధులు మంజూరు చేయడం అభినందనీయమన్నారు. అభివృద్ధి పనులు పూర్తయితే మహమ్మదాపూర్ గుట్టలు చారిత్రక, పర్యాటక కేంద్రంగా గుర్తింపు పొందుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు.
ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ జిల్లెల తిరుమల తిరుపతిరెడ్డి, హుస్నాబాద్ సింగిల్ విండో చైర్మన్ బొలిశెట్టి శివయ్య, మార్కెట్ కమిటీ చైర్మన్ కంది తిరుపతిరెడ్డి, మున్సిపల్ చైర్పర్సన్ దండి లక్ష్మి, వైస్ చైర్పర్సన్ చిత్తారి పద్మ, సింగిల్ విండో వైస్ చైర్మన్ ఎగ్గిడి ఐలయ్య, చిగురుమామిడి మండల అధ్యక్షుడు అందె సురేష్, సర్పంచుల ఫోరం అధ్యక్షుడు మార్క రాజ్ కుమార్ గౌడ్, సైదాపూర్ మండల కాంగ్రెస్ అధ్యక్షుడు చాడ వెంకటరెడ్డి, మాజీ బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు మిట్టపల్లి కిష్టయ్య, సిద్దిపేట జిల్లా కాంగ్రెస్ కార్యదర్శి బానోతు భాస్కర్ నాయక్.
మరియు చింతల బాలరాజు, అక్కన్నపేట మండల సర్పంచుల ఫోరం అధ్యక్షుడు వెంకటేష్, మాజీ కౌన్సిలర్ వల్లపు రాజు, ఉపసర్పంచ్ కత్తుల సమ్మరాజు యాదవ్, దుద్దేడ శ్రీనాథ్ గౌడ్, పోతుగంటి బాలయ్య, గట్టు రాములు గౌడ్, కల్లపల్లి వెంకటస్వామి, పూదరి శ్రీనివాస్, రమేష్ నాయక్, చెప్పాల శ్రీధర్, కొంకట సదానందం, బెజ్జంకి బాబు, సుగుర్తి బాలరాజ్, మౌటం సంపత్, మెరుగు వెంకటయ్య, దుద్దేడ తిరుపతి గౌడ్, ఆకుల వెంకటస్వామి, కోయడ శ్రీనివాస్, కాసర్ల ఐలయ్య, కుంచం రాజయ్య, కవ్వ రాజిరెడ్డి, సంపత్, గోపాల్, పొన్నం రవి, జిల్లెల మాధవరెడ్డి, శ్రీరామ చందు, కొంకట రాజు, రమేష్‌తో పాటు అనభేరి ప్రభాకర్ రావు అభిమానులు పాల్గొన్నారు.




