Dubbaka: మండల కాంగ్రెస్ అధ్యక్షుడిగా గూండా శంకర్ చెరుకు శ్రీనివాస్ రెడ్డికి సత్కారం
Dubbaka: అక్బర్‌పేట భూంపల్లి మండల కాంగ్రెస్ అధ్యక్షుడిగా గూండా శంకర్ నియామకం. హైదరాబాద్‌లో దుబ్బాక ఇన్‌ఛార్జ్ చెరుకు శ్రీనివాస్ రెడ్డితో మర్యాదపూర్వక భేటీ.
Dubbaka: మండల కాంగ్రెస్ అధ్యక్షుడిగా గూండా శంకర్ చెరుకు శ్రీనివాస్ రెడ్డికి సత్కారం
దుబ్బాక: సిద్దిపేట జిల్లా అక్బర్ పేట భూంపల్లి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా గూండా శంకర్ ను నియమించినందుకు ఈరోజు దుబ్బాక నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి చెరుకు శ్రీనివాస్ రెడ్డి గారిని హైదరాబాద్ లో తన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో సత్కరించిన మండల అధ్యక్షులు గుండా శంకర్.
ఈ సందర్భంగా గుండా శంకర్ గారు మాట్లాడుతూ తనపై నమ్మకంతో మండల పార్టీ అధ్యక్ష బాధ్యతలను అప్పగించినందుకు అధిష్టానానికి ఉమ్మడి మెదక్ జిల్లా ఇన్చార్జి మంత్రి మరియునాయకులు చెరుకు శ్రీనివాస్ రెడ్డి గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో బేగంపేట గ్రామ సర్పంచ్ అన్నబోయిన చంద్రశేఖర్, నగరం గ్రామం ఉప సర్పంచ్ రమేశ్, జిల్లా కార్యదర్శి ఎల్లన్న గారి సురేందర్ రెడ్డి, సీనియర్ నాయకులు బొమ్మెర శ్రీధర్, ఖాజీపూర్ మాజీ సర్పంచ్ పెరిక మధు, సోలిపేట ప్రసాద్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.




