Chegunta: ధాన్యం కొనుగోలుపై హరీష్ రావు ఆగ్రహం

Chegunta: చేగుంట మండలం కర్నాల్‌పల్లిలో ధాన్యం కొనుగోలు కేంద్రాలను మాజీ మంత్రి హరీష్ రావు పరిశీలించారు.

KARUNAKAR,	DUBBAK
Published on: 10 May 2026 4:50 PM IST
Chegunta
X

Chegunta: ధాన్యం కొనుగోలుపై హరీష్ రావు ఆగ్రహం

చేగుంట: దుబ్బాక నియోజకవర్గంలోని చేగుంట మండలం కర్నాల్‌పల్లి గ్రామంలోని ధాన్యం కొనుగోలు కేంద్రాలను మాజీ మంత్రి, అసెంబ్లీలో డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీష్ రావు, దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి, మెదక్ మాజీ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా రైతులతో నేరుగా మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు. కొనుగోలు కేంద్రంలో నెలకొన్న పరిస్థితులను చూసి తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.

ఈ సందర్భంగా హరీష్ రావు మాట్లాడుతూ..రాష్ట్రంలో రైతుల పరిస్థితి అత్యంత దారుణంగా మారిందని మండిపడ్డారు.కర్నాల్‌పల్లి కొనుగోలు కేంద్రం ప్రారంభించి 25 రోజులు పూర్తయినా ఇప్పటివరకు కేవలం రెండు లారీలు మాత్రమే రావడం ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనమన్నారు. “15 రోజులకు ఒక లారీ వస్తే రైతులు తమ ధాన్యాన్ని ఎప్పుడు అమ్ముకోవాలి? వారి పరిస్థితి ఏంటి?” అని ప్రశ్నించారు.ఇటీవల కురిసిన వర్షాలకు ధాన్యం తడిసిపోయిందని, మళ్లీ రైతులు ఎండబెట్టి సిద్ధం చేసినప్పటికీ ప్రభుత్వం కొనుగోలు చేయడం లేదని తెలిపారు.

KARUNAKAR,	DUBBAK

KARUNAKAR, DUBBAK

Next Story