Siddipet: సిద్దిపేట విద్యాలయాల్లో అల్పాహారం, భోజనం ప్రారంభించాలి!

Siddipet: సిద్దిపేట జిల్లాలో ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో అల్పాహారం, మధ్యాహ్న భోజనం వెంటనే ప్రారంభించాలని మాజీ మంత్రి హరీష్ రావు డిమాండ్.

RAJU, SIDDIPET
Published on: 18 Sept 2026 1:44 PM IST
Siddipet
X

Siddipet: సిద్దిపేట విద్యాలయాల్లో అల్పాహారం, భోజనం ప్రారంభించాలి!

Siddipet: రాష్ట్ర ప్రభుత్వం ఇతర జిల్లాలో ప్రారంభించిన విధంగా సిద్దిపేట జిల్లాలో సైతం ప్రభుత్వ విద్యాలయాలలో అల్పాహారం, మధ్యాహ్న భోజన వసతి సౌకర్యాన్ని వెంటనే ప్రారంభించాలని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

శుక్రవారం సిద్దిపేట జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలలో మిత్ర బ్లడ్ సెంటర్, ప్రాణసేతు ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన రక్తహీనత అవగాహన సదస్సులో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు. చాలామంది అమ్మాయిలు రక్తహీనతతో బాధపడుతున్నారన్నారు.

అమ్మాయిలందరూ రక్త పరీక్షలు తప్పకుండా చేయించుకోవాలన్నారు. రక్తహీనత సమస్యలు వచ్చినప్పుడు అమ్మాయిలు నీరసంగా, తలనొప్పి ఇలాంటి చాల సమస్యలు ఏర్పడి ఏకాగ్రత కోల్పోవడంతో వాటి ప్రభావం చదువు పై పడుతుందన్నారు.రక్తహీనతతో బాధపడేవారు వైద్యుల సూచన మేరకు కావలసిన జాగ్రత్తలు తీసుకొని మందులు పౌష్టిక ఆహారాన్ని తీసుకుంటే రక్తహీనత తొలిగి ఆరోగ్యంగా ఉంటారన్నారు.

పిల్లల భవిష్యత్తు లక్ష్యంగా ఇలాంటి రక్తహీనత పై అవగాహన సదస్సులు ఏర్పాటు చేసి ఉచితంగా రక్త పరీక్షలు చేపట్టడం జరిగిందన్నారు. బిఆర్ఎస్ సర్కార్ హయాంలో కాంట్రాక్ట్ లెక్చలర్లను రెగ్యులరైజేషన్ చేయడంతో విద్యా బోధన మరింత మెరుగుపడిందన్నారు.

తాను మంత్రిగా ఉన్నప్పుడు ఈ ప్రభుత్వ జూనియర్ కళాశాలను అన్ని విధాలుగా సహకరించి కావలసిన సదుపాయాలను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ప్రస్తుతం ఈ కళాశాలలో నెలకొన్న సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లి కావలసిన పూర్తిస్థాయి సదుపాయాలు సమకూర్చడానికితనవంతు కృషి చేస్తానన్నారు.

RAJU, SIDDIPET

RAJU, SIDDIPET