Siddipet: కార్మిక వర్గాల సమస్యలపై ప్రభుత్వంపై ఒత్తిడి తేలి హరీష్ రావు!

Siddipet: సిద్దిపేటలో BRTU నాయకులతో మాజీ మంత్రి హరీష్ రావు సమావేశం. ఔట్‌సోర్సింగ్, ఆశా వర్కర్ల సమస్యలపై ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తామని స్పష్టం.

RAJU, SIDDIPET
Published on: 1 Oct 2026 4:45 PM IST
Siddipet
X

Siddipet: కార్మిక వర్గాల సమస్యలపై ప్రభుత్వంపై ఒత్తిడి తేలి హరీష్ రావు!

Siddipet: కార్మిక వర్గాల సమస్యలను పై ప్రభుత్వం పై ఒత్తిడి తెచ్చేల ఆయా రంగాల కార్మికులతో సమన్వయం చేసుకుంటూ వారి సమస్యల పరిష్కారం కోసం నిరంతరం కృషి చేయాలని మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు గారు అన్నారు.. ఈ సందర్బంగా సిద్దిపేట క్యాంప్ కార్యాలయం లో కార్మిక విభాగం నాయకులకు దిశానిర్దేశం చేశారు.. గత ప్రభుత్వ కాలంలో కార్మికుల కోసం తీసుకున్న నిర్ణయాలు, ప్రస్తుత పరిస్థితుల్లో కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రజలకు వివరించి, కార్మికుల సమస్యలపై ప్రజల్లో అవగాహన కల్పించే విధంగా కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్లాలని సూచించారు...BRTU సిద్దిపేట జిల్లా పరిధిలోని వివిధ కార్మిక రంగాల అధ్యక్షులు, ఉపాధ్యక్షులు, ముఖ్య నాయకులతో సమావేశం అయ్యారు.

ఈ సమావేశంలో వివిధ కార్మిక రంగాలు ఎదుర్కొంటున్న సమస్యలు, కార్మికుల హక్కులు, ప్రభుత్వ విధానాలు, భవిష్యత్ కార్యాచరణ తదితర అంశాలపై మాట్లాడారు ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులకు కార్పొరేషన్ ఏర్పాటు చేస్తామని ప్రభుత్వం ప్రకటించినప్పటికీ, తమ డిమాండ్‌పై స్పష్టమైన పురోగతి కనిపించడం లేదని BRTU నాయకులు హరీష్ రావు గారికి వివరించారు.

ఈ సందర్బంగా హరీష్ రావు గారు మాట్లాడుతు.. ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులకు ఉద్యోగ భద్రత, వేతన భద్రత, ఏజెన్సీ వ్యవస్థ నుంచి రక్షణ, వంటి అంశాలపై ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తుందని ఈ విషయం లో ప్రభుత్వం పై ఒత్తిడి తెస్తామని చెప్పారు...ఆశా వర్కర్లకు సంబంధించిన వేతనాలు గౌరవ వేతనం, ఉద్యోగ భద్రత, సామాజిక భద్రత, ఇతర పెండింగ్ సమస్యలను ప్రభుత్వం పరిష్కరించడం లో విఫలం అయిందని, ఆశా వర్కర్లు కూడా తమ గౌరవ వేతనం, ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు.వివిధ రంగాల్లో పనిచేస్తున్న కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలు, వారి ప్రయోజనాలు, వేతనాలు, ఉద్యోగ భద్రత ప్రభుత్వం ద్రుష్టి కి తీసుకెళ్తానని చెప్పారు.ఈ సమావేశంలో మాజీ మున్సిపల్ చైర్మన్ కడవెర్గు రాజనర్సు మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ పాల సాయిరాం BRTU సిద్దిపేట జిల్లా అధ్యక్షులు పిండి అరవింద్ వివిధ కార్మిక రంగాల అధ్యక్షులు, ఉపాధ్యక్షులు, ముఖ్య నాయకులు పాల్గొన్నారు.

RAJU, SIDDIPET

RAJU, SIDDIPET