Siddipet: సిద్దిపేటలో 6 గంటల్లో 60 గణేష్ మండపాలు దర్శించుకున్న హరీశ్ రావు!

Siddipet: సిద్దిపేట పట్టణంలో 6 గంటల్లో 60 గణేష్ మండపాలను సందర్శించి విఘ్నేశ్వరుడిని దర్శించుకున్న మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్ రావు. మట్టి వినాయకులను పూజించాలని పిలుపు.

RAJU, SIDDIPET
Published on: 22 Sept 2026 2:08 PM IST
Siddipet
X

Siddipet: సిద్దిపేటలో 6 గంటల్లో 60 గణేష్ మండపాలు దర్శించుకున్న హరీశ్ రావు!

Siddipet: సిద్దిపేట పట్టణం లో 60 గణేష్ మండపాల విఘ్నేశ్వరున్ని దర్శించు కున్న మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్ రావు గారు.

ఏ శుభకార్యం ప్రారంభించినా ముందుగా విఘ్నేశ్వరుడిని పూజించడం మన సంస్కృతి, సంప్రదాయమని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్ రావు గారు అన్నారు. విఘ్నాలను తొలగించి కార్యసిద్ధిని ప్రసాదించే వినాయకుడి ఆశీస్సులు ప్రతి కుటుంబంపై ఉండాలని ఆకాంక్షించారు.వినాయక నవరాత్రుల సందర్భంగా సిద్దిపేట పట్టణం లో సోమవారం రాత్రి 60 గణేష్ మండపాల లో కొలువైన విఘ్నేశ్వరున్ని దర్శించుకున్నారు కార్యక్రమంలో హరీశ్ రావు మాట్లాడుతూ యజ్ఞం, హోమం, వ్రతం, పూజతో పాటు ఏ శుభకార్యమైనా వినాయకుడిని పూజిస్తామన్నారు.

“దేవుడిని ఎంత ఆడంబరంగా పూజించామన్నది ముఖ్యం కాదు ఎంత భక్తి, శ్రద్ధతో పూజించామన్నదే ముఖ్యమని. బంగారంతో పూజ చేసినా భక్తి లేకపోతే ప్రయోజనం లేదన్నారు మట్టితో చేసిన వినాయకుడినైన మనస్ఫూర్తిగా పూజిస్తే భగవంతుడి ఆశీస్సులు లభిస్తాయి” అని పేర్కొన్నారు. వినాయక ఉత్సవాల్లో మట్టి విగ్రహాలు, సహజ రంగుల వినియోగాన్ని ప్రోత్సహించాలని పిలుపునిచ్చారు. ప్లాస్టిక్, రసాయనాలు, హానికరమైన రంగుల వినియోగం వల్ల చెరువులు, నీటి వనరులు, భూగర్భ జలాలు కలుషితమై చివరకు ప్రజల ఆరోగ్యంపైనే ప్రభావం చూపుతాయని తెలిపారు.“పర్యావరణాన్ని కాపాడుకోవడం అంటే మన ఆరోగ్యాన్ని మనమే కాపాడుకోవడం.

మనం ప్రకృతిని ప్రేమిస్తే ప్రకృతి మనల్ని ప్రేమిస్తుందని చెప్పారు.. రాబోయే తరాలకు ఆరోగ్యకరమైన వాతావరణాన్ని అందించడం మనందరి బాధ్యతని గుర్తు చేశారు... వినాయక ఉత్సవాలకు ఆధ్యాత్మిక ప్రాధాన్యతతో పాటు సామాజిక ఐక్యతను పెంపొందించిన గొప్ప చరిత్ర ఉందన్నారు. స్వాతంత్ర్య ఉద్యమ సమయంలో లోకమాన్య బాలగంగాధర్ తిలక్ వినాయక ఉత్సవాలను ప్రజలను ఏకం చేసే వేదికగా ఉపయోగించారని గుర్తుచేశారు.“బాలగంగాధర్ తిలక్ వినాయక ఉత్సవాల ద్వారా ప్రజలను ఒక్కతాటిపైకి తీసుకొచ్చారు. అదే స్ఫూర్తిని మనం కొనసాగించాలి.

వినాయక మండపాలు విభేదాలకు వేదికలు కాకూడదు.. ప్రజల మధ్య ప్రేమ, అనుబంధం, సోదరభావం పెంచే వేదికలు కావాలి” అని పిలుపునిచ్చారు.ఒక్కొక్కరిగా చేసే కార్యక్రమం కంటే అందరూ కలిసి సమష్టిగా నిర్వహించే కార్యక్రమానికి ఎంతో గొప్పతనం ఉంటుందన్నారు. పిల్లలు, యువత, మహిళలు, భక్తులు అందరూ వినాయక నవరాత్రి ఉత్సవాల్లో భాగస్వాములై భక్తితో పాటు సామాజిక ఐక్యతను చాటాలని కోరారు.“మనందరి మధ్య ప్రేమ, గౌరవం, అనుబంధం మరింత పెరగాలి. విఘ్నేశ్వరుని ఆశీస్సులతో ప్రజలందరూ ఆయురారోగ్యాలు, సుఖసంతోషాలతో ఉండాలని విగ్నేశ్వరుని ప్రార్థించారు.

- హరీష్ రావు @ 6గంటలు...60 గణేష్ మండపాలు.

- ఆధ్యాత్మికకం... ఆత్మీయ పలకరింపు.

- ప్రజలతో మమైకం... నిత్య నూతనోత్సాహం తో ప్రజా అభిమానం.

- సిద్దిపేట పట్టణం లో 60 గణేష్ మండపాల్లో కొలువైన విగ్నేశ్వరున్ని హరీష్ రావు గారు సోమవారం రాత్రి దర్శించుకున్నారు.. నిత్యం ప్రజల మధ్య ఉన్న హరీష్ రావు నిత్యం ప్రజలకు నూతనోత్సాహమే.. సిద్దిపేట పట్టణం లో సోమవారం సాయంత్రం నుండి అర్థరాత్రి వరకు దాదాపు 6 గంటల పాటు 60 గణేష్ మండపాలను దర్శించుకున్నారు.. ఎక్కడికి వెళ్లిన చిన్న నుండి పెద్ద వరకు.. మహిళలు.. యువత కొత్త ఉత్సాహన్ని నింపారు.. ఒక వైపు ఆధ్యాత్మికం.. మరో వైపు ఆత్మీయ పలకరింపు తో ప్రజా అభిమానాన్ని చాటుకున్నారు హరీష్ రావు గారు.. ప్రజలతో మమైకం కొత్త కాదు కానీ ఆయన ప్రజల్లో ఎప్పుడు నిత్య నూతనోత్సాహం నింపే నాయకుడు అని ఎక్కడికి వెళ్లిన ఏ మండపం వద్ద కు వెళ్లిన యువత.. మహిళలు సెల్ఫీ జోష్ తో సందడి చేశారు.

RAJU, SIDDIPET

RAJU, SIDDIPET