Toguta: ఉపాధి హామీ కార్మికుల మధ్య హరీశ్ రావు బర్త్డే సెలబ్రేషన్స్
Toguta: మాజీ మంత్రి తన్నీరు హరీశ్ రావు జన్మదినాన్ని పురస్కరించుకుని సిద్దిపేట జిల్లా తొగుట మండలంలో బీఆర్ఎస్ నేతలు ఉపాధి హామీ కార్మికులతో కలిసి వేడుకలు నిర్వహించారు.
Toguta: ఉపాధి హామీ కార్మికుల మధ్య హరీశ్ రావు బర్త్డే సెలబ్రేషన్స్
Toguta: తెలంగాణ ఉద్యమ చరిత్రలో తనకంటూ ప్రత్యేక అధ్యాయాన్ని లిఖించుకున్న మాజీ మంత్రివర్యులు, బీఆర్ఎస్ ఎల్పీ ఉపనేత తన్నీరు హరీశ్ రావు కారణ జన్ముడని బీఆర్ఎస్ పార్టీ సిద్దిపేట జిల్లా తొగుట మండల అధ్యక్షులు జీడిపల్లి రాంరెడ్డి పేర్కొన్నారు.. హరీశ్ రావు జన్మదినోత్సవం పురస్కరించుకొని తొగుట మండలంలోని వెంకట్రావుపేట గ్రామంలో వనం చెరువు వద్ద గ్రామ సర్పంచ్ బండారు కవిత స్వామి గౌడ్ తో కలిసి బి ఆర్ ఎస్ పార్టీ తొగుట మండల అధ్యక్షులు జీడిపల్లి రాంరెడ్డి ఆధ్వర్యంలో ఉపాధి హామీ కార్మికుల మధ్య కేక్ కట్ చేసి వేడుకలను ఘనంగా నిర్వహించి, కార్మికులకు మజ్జిగ ప్యాకెట్లు పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తెలంగాణ ఉద్యమంలో పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారి అడుగుజాడల్లో నడుస్తూ ఉద్యమ జ్వాలను గ్రామగ్రామానికీ చేర్చిన నాయకుడు హరీశ్ రావు అని కొనియాడారు.




