Dubbaka: 44 ఏళ్ల నిరీక్షణ.. చివరకు శవపేటికగా మారిన ఇల్లాలి కల!
Dubbaka: పెళ్లైన రెండేళ్లకే గల్ఫ్ వెళ్లిన భర్త కోసం 44 ఏళ్లుగా కళ్లు కాయలు కాచేలా ఎదురుచూసిన సిద్దిపేట జిల్లా లక్ష్మికి.. చివరకు భర్త మృతదేహమే మిగిలింది.
Dubbaka: 44 ఏళ్ల నిరీక్షణ.. చివరకు శవపేటికగా మారిన ఇల్లాలి కల!
Dubbaka: సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం చెల్లాపూర్ కు చెందిన బోట్ల చంద్రయ్య, లక్ష్మికి పెళ్లయిన రెండేళ్లకే చంద్రయ్య సౌదీ అరేబియాకు వెళ్లాడు. మొదట్లో అప్పు డప్పుడు సమాచారం వచ్చినా, ఆ తర్వాత పూర్తిగా నిలిచిపోయింది. ఉత్తరాలు రావడం మానేశాయి.
ఫోన్లు లేని ఆ రోజుల్లో భర్త ఆచూకీ కోసం ఆమె ఎంతో తపించింది. ఆ తర్వాత సాంకేతికత పెరిగి ఫోన్ల కాలం వచ్చినా, ఆయన నుంచి ఒక్క కాల్ కూడా రాలేదు. గ్రామానికి గల్ఫ్ నుంచి ఎవరు వచ్చినా వారిని ఆపి, తన భర్త గురించి ఆరా తీసేది. ప్రతి సంక్రాంతి, ఉగాది, దీపావళి పండుగలకు ఈసారైనా వస్తాడేమోనని కళ్లు కాయలు కాచేలా ఎదురుచూసేది. భర్త నుంచి రూపాయి రాకపోయినా, ఆమె మాత్రం భర్త జ్ఞాపకాలతోనే కాలం గడిపింది.
భర్త సుదూర తీరాల్లో ఉన్నా లక్ష్మి తన బాధ్యత లను ఏనాడూ విస్మరించలేదు. కూలీ పనులు చేస్తూనే అత్తామామలైన బాలవ్వ, కిష్టయ్యను కన్న తల్లిదండ్రుల్లా సాకింది. వారి వృద్ధాప్యంలో సేవలు చేస్తూ, అనారోగ్య సమయలో అండగా ఉంది.




