Siddipet: కాళేశ్వరంపై రాజకీయ కుట్ర బయటపడింది.. కొత్త ప్రభాకర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు
Siddipet: కాళేశ్వరం ప్రాజెక్టుపై జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ నివేదికను రద్దు చేస్తూ హైకోర్టు ఇచ్చిన తీర్పును దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి స్వాగతించారు.
Siddipet: కాళేశ్వరంపై రాజకీయ కుట్ర బయటపడింది.. కొత్త ప్రభాకర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు
Siddipet: జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ఇచ్చిన నివేదిక ఇకపై చెల్లుబాటు కాదని, దానిపై ఎలాంటి తదుపరి చర్యలు తీసుకోవడానికి వీల్లేదన్న హైకోర్టు తీర్పును దుబ్బాక ఎమ్మెల్యే శ్రీ కొత్త ప్రభాకర్ రెడ్డి గారు స్వాగతించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కమిషన్స్ ఆఫ్ ఎంక్వైరీ యాక్ట్"లోని సెక్షన్ 8(B) ప్రకారం ఎవరి మీదైనా అభియోగాలు మోపే ముందు వారి అభిప్రాయాలను రికార్డ్ చేయాల్సిన బాధ్యత ఉన్నప్పటికీ, ఆ విధానాన్ని పూర్తిగా విస్మరించడం జరిగింది. నివేదిక పూర్తికాకముందే, అధికారికంగా బయటకు రాకముందే అసెంబ్లీలో చర్చించడం, మీడియాకు లీకులు ఇవ్వడం వెనుక ముమ్మాటికీ రాజకీయ కుట్ర దాగి ఉందని అన్నారు.
విచారణప్రక్రియఅంతాలోపభూయిష్టంగా సాగిందని, సహజ న్యాయ సూత్రాలను తుంగలో తొక్కి ఏకపక్షంగా ఒక పార్టీకి అనుకూలంగా ఈ నివేదిక తయారు చేశారని ఆయన విమర్శించారు.తెలంగాణ రైతుల ప్రాణాధారమైన కాళేశ్వరం ప్రాజెక్టుపై బురద చల్లి, మాజీ ముఖ్యమంత్రిని బద్నాం చేయాలని చూసిన ప్రభుత్వానికి హైకోర్టు ఇచ్చిన ఈ తీర్పు చెంపపెట్టు వంటిదని పేర్కొన్నారు.విచారణకు మేము వ్యతిరేకం కాదని, కానీ ఆ విచారణ పారదర్శకంగా, నిష్పక్షపాతంగా జరగాలని స్పష్టం చేశారు.




