Dubbaka: హిందూ సమాజం ఏకం కావాలి.. దుబ్బాకలో భారీ సమ్మేళనానికి అంతా సిద్ధం!

Dubbaka: దుబ్బాక శ్రీ బాలాజీ దేవాలయంలో శనివారం నిర్వహించనున్న హిందూ సమ్మేళనం వివరాలు.

Chindam Karunakar, Dubbak
Published on: 5 May 2026 9:54 AM IST
Dubbaka
X

Dubbaka: హిందూ సమాజం ఏకం కావాలి.. దుబ్బాకలో భారీ సమ్మేళనానికి అంతా సిద్ధం!

Siddipet: తేదీ 9 శనివారం రోజున సాయంత్రం 5 గంటలకు సిద్దిపేట జిల్లా దుబ్బాకలోని శ్రీ బాలాజీ దేవాలయంలో జరగబోయే హిందూ సమ్మేళనాన్ని విజయవంతం చేయాలని హిందూ సమ్మేళన ఉత్సవ కమిటీ పిలుపునివ్వడం జరిగింది. ఈ సందర్భంగా స్థానిక దుబ్బాకలోని శ్రీ బాలాజీ దేవాలయం లో ఉత్సవానికి సంబంధించిన కరపత్రాన్ని విడుదల చేయడం జరిగింది.ఈ సందర్భంగా ఉత్సవ కమిటీ బాధ్యులు వడ్లకొండ శ్రీధర్ గారు మాట్లాడుతూ హిందూ సంఘటనే లక్ష్యంగా హిందూ సమాజం యొక్క మూల స్తంభాలు హిందూ సమాజ పట్ల గౌరవభావం ఏకాత్మత భావం సోదర్మం పట్ల అంకితభావం సేవ గుణం వంటి వాటిని వికసింప చేసేందుకు అందరి భాగస్వామ్యాన్ని కోరుకుంటూ ఈ హిందూ సమ్మేళనాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.

సాయంత్రం ఐదున్నరకి సుదర్శన హోమం మరియు హనుమాన్ చాలీసా పారాయణం మరియు సామూహిక శ్రీరామ జయరామ జయ జయ రామ మంత్ర జపం, బాలికల చేత సాంప్రదాయ నృత్య ప్రదర్శన ఉంటుంది.

ఈ కార్యక్రమానికి శ్రీ కమలానంద భారతి గారు, ముఖ్య వక్కగాఅప్పల ప్రసాద్ జి గారు, మహిళా విభాగం నుండి అతిథిగా శ్రీమతి రెడ్డిపల్లి స్వప్న గారు విచ్చేయనున్నారు.

Chindam Karunakar, Dubbak

Chindam Karunakar, Dubbak

Next Story