Dubbaka: దుబ్బాక పట్టణంలో చోరీ..

Dubbaka: సిద్దిపేట జిల్లా దుబ్బాకలో భారీ దొంగతనం. తాళం వేసిన ఇంట్లోకి చొరబడి 1.5 కేజీల బంగారం, 8 కేజీల వెండి, రూ.8 లక్షల నగదు ఎత్తుకెళ్లిన దొంగలు.

Chindam Karunakar, Dubbak
Published on: 30 Jun 2026 8:08 AM IST
Dubbaka
X

Dubbaka: దుబ్బాక పట్టణంలో చోరీ..

దుబ్బాక: తాళం వేసిన ఇంట్లోకి చొరబడిన దొంగలు భారీగా బంగారం నగదు ఎత్తుకెళ్లిన ఘటన సిద్దిపేట జిల్లా దుబ్బాక పట్టణంలోని 15 వార్డులో అర్ధరాత్రి చోటుచేసుకుంది. దుబ్బాక పోలీసులు, బాధిత కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం పట్టణంలోని 15 వ వార్డులో చింత రాజకుమార్ అనే మెడికల్ ఏజెన్సీ నిర్వాహకుడు తొమ్మిది రోజుల క్రితం తన కుటుంబంతో కలిసి తీర్థయాత్రలకు వెళ్లారు.

దీంతో ఇంటికి తాళాలు వేసి ఉన్నాయని గుర్తించిన దొంగలు, అర్ధరాత్రి ఇంటి వెనకవైపు కిటికీ ఊచలను విరగ్గొట్టి లోనికి ప్రవేశించారు. ఇంట్లోని బెడ్రూంలో ఉన్న లాకర్ను ధ్వంసం చేసి, దానిలో ఉన్న 1.5 కిలోల బంగారు ఆభరణాలు, 8 కిలోల వెండి, 8 లక్షల నగదును అపరించారు.

ఉదయం ఇంటి పరిసరాలను శుభ్రం చేసేందుకు వచ్చిన పనిమనిషి ఇంటి కిటికీ ఊచలు విరగ్గొట్టి ఉండడం చూసి, కంగారుపడి చుట్టుపక్కల వారికి, యజమానికి సమాచారం అందించింది. సమాచారం అందుకున్న దుబ్బాక ఎస్సై కీర్తి రాజు తన సిబ్బందితో ఘటనా స్థలానికి చేరుకొని క్లూస్ టీం, డాగ్ స్క్వాడ్ తో ఆధారాలు సేకరించారు.

Chindam Karunakar, Dubbak

Chindam Karunakar, Dubbak

Next Story