Husnabad: ప్రతి రైతు తప్పనిసరిగా 'రైతు గుర్తింపు కార్డు' తీసుకోవాలి ఏవో!

Husnabad: కేంద్ర ప్రభుత్వ సూచనల మేరకు ప్రతి రైతు 'రైతు గుర్తింపు కార్డు' తీసుకోవాలి. హుస్నాబాద్‌లో అవగాహన కల్పించిన వ్యవసాయ అధికారిణి పూజ. గడువు సెప్టెంబర్ 30.

CH SRINIVAS, HUSNABAD
Published on: 29 Sept 2026 6:41 PM IST
Husnabad
X

Husnabad: ప్రతి రైతు తప్పనిసరిగా 'రైతు గుర్తింపు కార్డు' తీసుకోవాలి ఏవో!

Husnabad: కేంద్ర ప్రభుత్వ సూచన మేరకు ప్రతి రైతు ' రైతు గుర్తింపు కార్డు' తీసుకోవాలని సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ వ్యవసాయ అధికారిని పూజా తెలిపారు. హుస్నాబాద్ రైతు వేదికలో రైతులకు రైతు గుర్తింపు కార్డు పై అవగాహన కల్పించారు. ప్రతి వ్యక్తికి ఆధార్ కార్డు లాగా ప్రతి రైతుకు రైతు గుర్తింపు కార్డు తప్పనిసరిగా ఉండాలని ప్రభుత్వం ఈ విధానాన్ని తీసుకువచ్చిందన్నారు.

పంటలు అమ్ముకోవడానికి, పంట నమోదుకు, యూరియా బుకింగ్ చేసుకోవడానికి రైతు గుర్తింపు కార్డు ఉపయోగపడుతుందన్నారు. ఇప్పటి వరకు మండలంలో 80 శాతం రైతుల రిజిస్ట్రేషన్ పూర్తయిందని, మిగిలిన 20 శాతం రైతులు దగ్గర్లోని వ్యవసాయ విస్తరణ అధికారి వద్దకాని, మీసేవ ద్వారా కానీ, సహకార సంఘాల ద్వారా కానీ రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చన్నారు. రైతు గుర్తింపు కార్డు అనేది ప్రతి రైతుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అందిస్తున్న సంక్షేమ పథకాల లబ్ధి పొందడానికి ఉపయోగపడుతుందని పేర్కొన్నారు. సెప్టెంబర్ 30వ తేదీ చివరి తేదీగా ఉందని ప్రతి ఒక్క రైతు రిజిస్ట్రేషన్ చేసుకోవాలని వ్యవసాయశాఖ ద్వారా తెలియజేశారు.

CH SRINIVAS, HUSNABAD

CH SRINIVAS, HUSNABAD