Husnabad: హుస్నాబాద్ పారిశుద్ధ్య కార్మికులకు ఆయుష్మాన్ భారత్ కార్డులు

Husnabad: హుస్నాబాద్ మున్సిపాలిటీలో నమస్తే పథకం కింద కార్మికులకు ఆయుష్మాన్ భారత్ కార్డులు, పీపీఈ కిట్ల పంపిణీ. కార్మికుల ఆరోగ్యం, భద్రతే ప్రభుత్వ లక్ష్యమన్న అధికారులు.

CH SRINIVAS, HUSNABAD
Published on: 14 July 2026 2:22 PM IST
Husnabad
X

Husnabad: హుస్నాబాద్ పారిశుద్ధ్య కార్మికులకు ఆయుష్మాన్ భారత్ కార్డులు

హుస్నాబాద్: సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పట్టణంలో పురపాలక సంఘ చైర్ పర్సన్ శ్ దండి లక్ష్మి ,కమిషనర్ మల్లికార్జున్ ఆధ్వర్యంలో నమస్తే పధకం కింద చెత్త సేకరణ చేసే కార్మికులకు ఆయుష్మాన్ భారత్ కార్డులు, పిపిఈ కిట్లు పంపిణీ చేసే కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది.

ఈ కార్యక్రమంలో అర్హులైన వ్యర్థాల సేకరణ కార్మికులకు ఆయుష్మాన్ భారత్ ఆరోగ్య కార్డులు మరియు వ్యక్తిగత రక్షణ పరికరాలు (PPE Kits) పంపిణీ చేయబడినవి.

నమస్తే పథకం ద్వారా పారిశుద్ధ్య కార్మికులు మరియు వ్యర్థాల సేకరణ కార్మికుల ఆరోగ్య భద్రత, సామాజిక భద్రత, గౌరవప్రదమైన జీవనం మరియు వృత్తి పరమైన రక్షణ కల్పించడమే ప్రధాన లక్ష్యం. ఆయుష్మాన్ భారత్ కార్డు ద్వారా ప్రభుత్వం అందించే ఆరోగ్య బీమా సేవలను పొందే అవకాశం కలుగుతుంది.

అలాగే పంపిణీ చేసిన పీపీఈ కిట్లు వ్యర్థాల సేకరణ సమయంలో కార్మికులు తమ ఆరోగ్యాన్ని రక్షించుకునేందుకు ఎంతో ఉపయోగపడతాయి.ఈ సందర్భంగా మున్సిపల్ చైర్ పర్సన్, కమిషనర్ మరియు పాలకవర్గ సభ్యులు మాట్లాడుతూ, పట్టణ పరిశుభ్రత పరిరక్షణలో వ్యర్థాల సేకరణ కార్మికుల సేవలు ఎంతో విలువైనవని, వారి ఆరోగ్యం, భద్రత మరియు సంక్షేమానికి ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను సమర్థవంతంగా అమలు చేయడం మున్సిపాలిటీ బాధ్యతగా కొనసాగుతుందని తెలిపారు.

హుస్నాబాద్ మున్సిపాలిటీ పారిశుద్ధ్య కార్మికులు మరియు వ్యర్థాల సేకరణ కార్మికుల సంక్షేమానికి కట్టుబడి ఉందని, భవిష్యత్తులో కూడా ఇలాంటి సంక్షేమ కార్యక్రమాలను నిరంతరం నిర్వహిస్తుందని తెలియజేశారు.

ఈ కార్యక్రమంలో వైస్ చైర్పర్సన్ చిత్తారి పద్మ , కౌన్సిలర్స్ బూరుగు లత,పిల్లి తిరుపతి, పూదరి వరప్రసాద్ , కేశవేని రమేష్ ,బొల్లి శ్రీనివాస్ , గాదేపాక రవీందర్ , వాల సుప్రజ ,స్వరూప , కోఆప్షన్ సభ్యులు హసన్ ,సరోజన , మున్సిపల్ సానిటరీ ఇన్స్పెక్టర్ బాల ఎల్లం, పర్యావరణ అధికారి రవికుమార్, DBRO సిబ్బంది రాజు,జవాన్ ప్రభాకర్, శ్రీకాంత్, మరియు సిబ్బంది పాల్గొన్నారు.

CH SRINIVAS, HUSNABAD

CH SRINIVAS, HUSNABAD

Next Story