Siddipet: తెలంగాణ సంస్కృతికి ప్రతీక బతుకమ్మ: ప్రిన్సిపల్ వి. లలిత!
Siddipet: హుస్నాబాద్ ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలలో ఎన్ఎస్ఎస్ ఆధ్వర్యంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు; ప్రిన్సిపల్ లలిత, విద్యార్థినులు, అధ్యాపకుల ఉత్సాహభరిత భాగస్వామ్యం.
Siddipet: తెలంగాణ సంస్కృతికి ప్రతీక బతుకమ్మ: ప్రిన్సిపల్ వి. లలిత!
Siddipet: సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ లోనీ ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలలో జాతీయ సేవా పథకం (ఎన్‌ఎస్‌ఎస్) ఆధ్వర్యంలో శుక్రవారం బతుకమ్మ సంబరాలను ఘనంగా నిర్వహించారు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగను పురస్కరించుకుని విద్యార్థినులు, అధ్యాపకులు ఆటపాటలతో సందడి చేశారు.ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపాల్, ఎన్‌ఎస్‌ఎస్ చైర్మన్ వీ. లలిత మాట్లాడుతూ.. పూలను దేవతలుగా భావించి పూజించే విశిష్టమైన పండుగ బతుకమ్మ అని పేర్కొన్నారు. తెలంగాణ సాంస్కృతిక ఆత్మగౌరవానికి, ప్రకృతి ఆరాధనకు, మహిళల జీవన విధానానికి ఈ పండుగ ప్రతీకగా నిలుస్తుందన్నారు.
ఎన్‌ఎస్‌ఎస్ ప్రోగ్రాం అధికారి డి. కర్ణాకర్ మాట్లాడుతూ.. బతుకమ్మ తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు నిలువుటద్దమని పేర్కొన్నారు. అనంతరం మహిళా అధ్యాపకులు, అధ్యాపకేతర సిబ్బంది, ఎన్‌ఎస్‌ఎస్ వాలంటీర్లు, విద్యార్థినులు బతుకమ్మ ఆటపాటలతో అలరించారు.
ఈ కార్యక్రమంలో అధ్యాపకులు డి. రవీందర్, ఎస్. సదానందం, టి. నిర్మలాదేవి, బి. లక్ష్మయ్య, ఏ. సంపత్, ఎస్. కవిత, కె. స్వరూప, జి. కవిత, ఆస్మా ఫిర్దూస్, ఓ. రాణి, జూనియర్ అసిస్టెంట్లు కె. గీతాంజలి, ఎస్. రాములు, రికార్డు అసిస్టెంట్ టి. రమాదేవి, ఎన్‌ఎస్‌ఎస్ వాలంటీర్లు, విద్యార్థినులు పాల్గొన్నారు.




