Husnabad: సిద్దిపేట సభకు కాంగ్రెస్ శ్రేణులు తరలిరావాలి

Husnabad: ఈ నెల 19న సిద్దిపేటలో సీఎం రేవంత్‌రెడ్డి నిర్వహించే సభలో ఇందిరమ్మ బీమా, చీరల పంపిణీ ఉండనుందని, కాంగ్రెస్ శ్రేణులు తరలిరావాలని పట్టణ అధ్యక్షుడు కోరారు.

CH SRINIVAS, HUSNABAD
Published on: 16 Nov 2026 9:43 PM IST
Husnabad
X

Husnabad: సిద్దిపేట సభకు కాంగ్రెస్ శ్రేణులు తరలిరావాలి

హుస్నాబాద్: ఈ నెల 19న సిద్దిపేటలో నిర్వహించనున్న ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌రెడ్డి సభకు హుస్నాబాద్ పట్టణ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజాప్రతినిధులు, పార్టీ అభిమానులు అధిక సంఖ్యలో తరలిరావాలని పట్టణ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు వి.వి. రమణ పిలుపునిచ్చారు.

ఈ సందర్భంగా నిర్వహించే కార్యక్రమంలో ప్రతి కుటుంబానికి వర్తించే ఇందిరమ్మ బీమా యోజన పథకాన్ని ప్రారంభించడంతోపాటు ఇందిరమ్మ చీరల పంపిణీ చేపట్టనున్నట్లు తెలిపారు.

అలాగే అర్హులైన లబ్ధిదారుల ఖాతాల్లో చేయూత పింఛన్ల నగదును ముఖ్యమంత్రి జమ చేయనున్నట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ శ్రేణులు పెద్ద సంఖ్యలో పాల్గొని సభను విజయవంతం చేయాలని ఆయన కోరారు.

CH SRINIVAS, HUSNABAD

CH SRINIVAS, HUSNABAD