Husnabad: హుస్నాబాద్‌లో కాంగ్రెస్ 1000 రోజుల పాలన సంబరాలు
Husnabad: హుస్నాబాద్‌లో కాంగ్రెస్ ప్రభుత్వం 1000 రోజుల పాలన సంబరాలు ఘనంగా నిర్వహించారు. ర్యాలీలు చేపట్టి, బాణాసంచా కాల్చి, ప్రజలకు స్వీట్లు పంచుకున్నారు.
Husnabad: హుస్నాబాద్‌లో కాంగ్రెస్ 1000 రోజుల పాలన సంబరాలు
హుస్నాబాద్: సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పట్టణంలో కాంగ్రెస్ ప్రభుత్వం 1000 రోజుల ప్రజా పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు సంబరాలు జరుపుకున్నారు. స్థానిక మల్లె చెట్టు చౌరస్తా నుండి అంబేద్కర్ చౌరస్తా వరకు నృత్యాలు చేస్తూ భారీ ర్యాలీ నిర్వహించారు.
బాణాసంచా కాల్చి స్వీట్లు పంచుకొని సంబరాలు చేసుకున్నారు. కాంగ్రెస్ అగ్ర నాయకురాలు సోనియా గాంధీ నేతృత్వంలో రాష్ట్రంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో ఏర్పడ్డ ప్రజా పాలన ప్రభుత్వం విజయవంతంగా 1000 రోజుల పాలన పూర్తి చేసుకుందని కాంగ్రెస్ నాయకులు అన్నారు.
వెయ్యి రోజుల్లో అనేక సంక్షేమ పథకాలు అమలు చేసి ప్రజా ప్రభుత్వం అని నిరూపించుకుందని తెలిపారు. గత పదేళ్ల కాలంలో బిఆర్ఎస్ రాష్ట్రాన్ని బ్రష్టు పట్టించి, ఇప్పుడు వెయ్యి రోజుల కాంగ్రెస్ సంక్షేమ పాలన చూసి ఓర్వలేక అప నిందలు వేస్తోందని ఆరోపించారు. బిఆర్ఎస్ నాయకులు ఎన్ని కలలు కన్నా వచ్చేది మళ్లీ కాంగ్రెస్ ప్రభుత్వమేనని గుర్తు చేశారు.




