Husnabad: హుస్నాబాద్‌లో ఇందిరాగాంధీ 42వ వర్ధంతి వేడుకలు

Husnabad: హుస్నాబాద్ అంబేడ్కర్ చౌరస్తాలో ఇందిరాగాంధీ 42వ వర్ధంతి నిర్వహించిన కాంగ్రెస్ నాయకులు. చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు.

CH SRINIVAS, HUSNABAD
Published on: 31 Oct 2026 7:55 PM IST
Husnabad
X

Husnabad: హుస్నాబాద్‌లో ఇందిరాగాంధీ 42వ వర్ధంతి వేడుకలు

హుస్నాబాద్: సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ అంబేద్కర్ చౌరస్తాలో మాజీ ప్రధాని, దివంగత ఇందిరాగాంధీ 42 వ వర్ధంతి కార్యక్రమాన్ని కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించారు.

ఈ సందర్భంగా ఇందిరాగాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఉక్కు మహిళగా దేశాన్ని అభివృద్ధి పథంలో నడిపించిన గొప్ప నాయకురాలు ఇందిరాగాంధీ అని కాంగ్రెస్ నాయకులు కొనియాడారు.

ఇప్పటికీ కూడా దేశంలో ఇందిరమ్మ ఇల్లు లేని ఊరు లేదని ఇందిరమ్మ హయాంలో సంక్షేమ ఫలాలు అందని పేదవారు ఎవరు లేరని పేర్కొన్నారు. ఇందిరా గాంధీ చేసిన సేవలు చిరస్మరణీయమని, దేశం కోసం ప్రాణ త్యాగం చేశారన్నారు.

CH SRINIVAS, HUSNABAD

CH SRINIVAS, HUSNABAD