Husnabad: అమరుల స్మారక భవనానికి రూ.2.30 కోట్లు.. పొన్నంకు కృతజ్ఞతలు
Husnabad: హుస్నాబాద్‌లో అనభేరి, సింగిరెడ్డి అమరుల స్మారక భవనానికి రూ.2.30 కోట్ల నిధుల విడుదలపై హర్షం; మంత్రి పొన్నం ప్రభాకర్‌కు సీపీఐ నేతల కృతజ్ఞతలు.
Husnabad: అమరుల స్మారక భవనానికి రూ.2.30 కోట్లు.. పొన్నంకు కృతజ్ఞతలు
హుస్నాబాద్: నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా విరోచితంగా సాగిన తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట యోధులు మహ్మదపూర్ మృత వీరుల స్మృతి చిహ్నంగా ఉన్న అనభేరి ప్రభాకర్ రావు, సింగిరెడ్డి భూపతి రెడ్డి మరో 10 మంది అమరవీరుల స్మారక భవనం నిర్మాణానికై 2.20 రెండు కొట్ల 30 లక్షల నిధులు విడుదలకు కృషి చేసిన హుస్నాబాద్ శాసన సభ్యులు రాష్ట్ర రోడ్డు రవాణా బిసి సంక్షేమ శాఖ మంత్రి వర్యులు పొన్నం ప్రభాకర్ కు సిపిఐ నేత మాజీ ఎమ్మెల్యే చాడ వెంకటరెడ్డి, సిపిఐ కన్వీనర్ జాగీర్ సత్యనారాయణ, సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి హుస్నాబాద్ మాజీ వైస్ ఎంపిపి గడిపె మల్లేశ్, మండల సిపిఐ నాయకులు పొదిల కుమారస్వామి, జనగాం రాజ్ కుమార్, గూడ పద్మ, అయిలేని సంజీవరెడ్డి, కాల్వల ఎల్లయ్య, అయిలేని మల్లారెడ్డి,జంగ విజయ,
దొంతరవేని రజిత, మహ్మదపుర్, గ్రామ శాఖ సిపిఐ కార్యదర్శి పిట్టల మెగిలయ్య, మాజీ ఎంపిటిసి సభ్యులు పిట్టల సుధకర్,మాజీ సర్పంచ్ పిట్టల కనకలక్ష్మి, సిపిఐ నాయకులు పిట్టల ప్రసాద్, పిట్టల బాలయ్య, దుద్దేడ రాజయ్యతో పాటు అనభేరి, సింగిరెడ్డి అమరుల కుటుంబ సభ్యులు మంత్రి పొన్నం ప్రభాకర్ కు కృతజ్ఞతలు తెలిపుతూ హర్షం వ్యక్తం చేశారు.




