Husnabad: వి.బి.జి. రామ్‌జీ పథకంతో తోటపల్లిలో అభివృద్ధి పనులు
Husnabad: హుస్నాబాద్ మండలం తోటపల్లి గ్రామంలో వి.బి.జి. రామ్‌జీ పథకం ద్వారా పొలం బాటలు, మౌలిక వసతుల కల్పన పనులను సర్పంచ్, ఉపసర్పంచ్ ప్రారంభించారు.
Husnabad: వి.బి.జి. రామ్‌జీ పథకంతో తోటపల్లిలో అభివృద్ధి పనులు
హుస్నాబాద్: వి.బి.జి. రామ్‌జీ పథకం ద్వారా హుస్నాబాద్ మండలంలోని తోటపల్లి గ్రామంలో పలు అభివృద్ధి పనులు చేపడుతున్నారు. ఈ పనుల్లో మండలంలోనే గ్రామం ముందంజలో నిలుస్తోంది. పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క ఆదేశాలు, రాష్ట్ర బీసీ సంక్షేమ, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ సూచనల మేరకు గ్రామంలో మౌలిక సదుపాయాల కల్పనకు ప్రాధాన్యమిస్తున్నారు.
ఇందులో భాగంగా పూస వేర్లపల్లి నుంచి సంఘపురం బండ వరకు చేపట్టనున్న పొలం బాట నిర్మాణ పనులను సోమవారం గ్రామ సర్పంచ్ బంక లక్ష్మీ చందు, ఉపసర్పంచ్ పోలురాజు కొబ్బరికాయ కొట్టి ప్రారంభించారు. ఇప్పటికే గ్రామంలో 68 ఇందిరమ్మ ఇళ్లకు 90 రోజుల పనిదినాలు కల్పించారు.
నిరుపయోగంగా ఉన్న బోరుబావుల పునరుద్ధరణ, పశువుల నీటి తొట్టెల నిర్మాణానికి స్థలాల గుర్తింపు, నల్లాల బావి నుంచి జనగాం శివారు వరకు రోడ్డు నిర్మాణం, కల్వర్టు, పాఠశాల ప్రహరీ, మహిళా సంఘాల భవనం నిర్మాణంతోపాటు పొలం బాటల అభివృద్ధి పనులు చేపడుతున్నారు.
గ్రామ ప్రజలకు మెరుగైన మౌలిక సదుపాయాలు కల్పించడమే లక్ష్యంగా ప్రజాప్రతినిధులు, అధికారులు సమన్వయంతో పనులు చేపడుతున్నారు.ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు, గ్రామ పెద్దలు, ఫీల్డ్ అసిస్టెంట్ కోటి అన్నపూర్ణ పాల్గొన్నారు.




