Husnabad: మృతుల కుటుంబాలను పరామర్శించిన మంత్రి పొన్నం ప్రభాకర్

Husnabad: హుస్నాబాద్ మండలంలో మృతుల కుటుంబాలను పరామర్శించిన మంత్రి పొన్నం ప్రభాకర్. బాధిత కుటుంబాలకు నివాళులర్పించి అండగా ఉంటామని హామీ.

CH SRINIVAS, HUSNABAD
Published on: 15 Sept 2026 6:12 PM IST
Husnabad
X

Husnabad: మృతుల కుటుంబాలను పరామర్శించిన మంత్రి పొన్నం ప్రభాకర్

హుస్నాబాద్: సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మండలం, హుస్నాబాద్ పట్టణంలో ఇటీవల మృతి చెందిన పలువురి కుటుంబాలను రవాణా మరియు బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ పరామర్శించారు.

ఈ సందర్భంగా మృతుల చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించిన మంత్రి పొన్నం ప్రభాకర్, వారి కుటుంబ సభ్యులను పరామర్శించి తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు.

హుస్నాబాద్ మండలంలోని ఆరెపల్లి, జిల్లాలగడ్డ సర్పంచ్ స్వరూప తల్లి భూక్యా బంగారమ్మ, బొమ్మగాని బుచ్చవ్వ కుటుంబాలను మంత్రి పరామర్శించారు.

అదేవిధంగా హుస్నాబాద్ పట్టణంలోని 4వ వార్డుకు చెందిన షేక్ కమల్ సాబ్,14వ వార్డుకు చెందిన షేక్ చాంద్ పాషా, 20వ వార్డుకు చెందిన దుబాల శ్రీనివాస్ తండ్రి, 8వ వార్డుకు చెందిన మధురవేణి శ్రీనివాస్ కోడలు, కాశవేణి సాంబరాజు నానమ్మ, 9వ వార్డుకు చెందిన కాల్వల కనకయ్య, 11వ వార్డుకు చెందిన కొహెడ ఎల్లయ్య కుటుంబాలను కూడా మంత్రి పరామర్శించారు.ఈ సందర్భంగా మృతుల కుటుంబ సభ్యులకు అండగా ఉంటామని మంత్రి పొన్నం ప్రభాకర్ హామీ ఇచ్చారు.

CH SRINIVAS, HUSNABAD

CH SRINIVAS, HUSNABAD