Husnabad: వాతావరణ పరిస్థితిని సమిష్టిగా ఎదుర్కోవాలి మంత్రి పొన్నం
Husnabad: హుస్నాబాద్ ఎల్లమ్మ ఆలయంలో చండీయాగంలో పాల్గొన్న మంత్రి పొన్నం ప్రభాకర్. అనంతరం మండల పరిషత్ సర్వసభ్య సమావేశంలో అధికారులకు, ప్రజాప్రతినిధులకు సూచనలు.
Husnabad: వాతావరణ పరిస్థితిని సమిష్టిగా ఎదుర్కోవాలి మంత్రి పొన్నం
హుస్నాబాద్: ప్రస్తుత వాతావరణ పరిస్థితిని అందరం సమిష్టిగా ఎదుర్కోవాలని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. గురు పౌర్ణమి సందర్భంగా సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ లోని స్థానిక ఎల్లమ్మ ఆలయంలో చండీయాగంలో మంత్రి పాల్గొన్నారు.
అనంతరం హుస్నాబాద్ మండల పరిషత్ కార్యాలయంలో జరిగిన సర్వసభ్య సమావేశంలో పాల్గొని గ్రామాల సర్పంచులు, అధికారులకు పలు సూచనలు చేశారు.
తాగునీటి సమస్య, వ్యవసాయానికి ఆరుతడి పంటలపై రైతాంగానికి అవగాహన కల్పించాలని, విద్యుత్ ఇబ్బందులు లేకుండా చూసుకోవాలన్నారు.
గ్రామాలలో పెండింగ్ పనులు, సాంక్షన్ అయిన పనులు వెంటనే పూర్తి చేయాలని సర్పంచులకు సూచించారు. ఇంకుడు గుంతలు నిర్మించడంలో ముందుండే గ్రామాల అభివృద్ధిలో తాను ముందు ఉంటానని, ప్రభుత్వ పాఠశాలల్లో సమస్యలు లేకుండా పరిష్కారం చేసుకోవాలన్నారు. ప్రతి గ్రామంలో జల శక్తి సంరక్షణ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలన్నారు.




