Husnabad: ఎల్ నినో ప్రభావం అధికారులకు మంత్రి పొన్నం కీలక ఆదేశాలు

Husnabad: ఎల్ నినో ప్రభావంతో తీవ్ర వర్షాభావ పరిస్థితుల దృష్ట్యా అధికారులు క్షేత్రస్థాయిలో అందుబాటులో ఉండాలని హుస్నాబాద్‌ సమీక్షలో మంత్రి పొన్నం ప్రభాకర్ ఆదేశం.

CH SRINIVAS, HUSNABAD
Published on: 23 July 2026 3:41 PM IST
Husnabad
X

Husnabad: ఎల్ నినో ప్రభావం అధికారులకు మంత్రి పొన్నం కీలక ఆదేశాలు

హుస్నాబాద్: ఎల్ నినో ప్రభావంతో రాష్ట్రంలో తీవ్ర వర్షాభావ పరిస్థితులు ఏర్పడుతుండడంతో గ్రామీణ ప్రాంతాల్లో అధికారులు క్షేత్రస్థాయిలో ప్రజలకు అందుబాటులో ఉండాలని మంత్రి పొన్నం ప్రభాకర్ ఆదేశించారు.

సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ ఐఓసీ కార్యాలయంలో సిద్దిపేట, కరీంనగర్, హనుమకొండ జిల్లాల కలెక్టర్లు, అధికారులతో ఎల్ నినో ప్రభావం పై నిర్వహించిన సమీక్ష సమావేశంలో మంత్రి పాల్గొని అధికారులకు దిశా నిర్దేశం చేశారు. స్వేచ్ఛగా ఎలాంటి ఒత్తిడి లేకుండా ప్రభుత్వ కార్యక్రమాలు ప్రజల్లోకి తీసుకెళ్లాలని అధికారులకు సూచించారు.

భవిష్యత్తులో తాగునీటికి సంబంధించి ప్రధాన సమస్య వచ్చే అవకాశం ఉందని, వచ్చే జూన్ వరకు వర్షాలు లేవని శాస్త్రవేత్తలు చెబుతున్నారన్నారు. పశువులకు పశుగ్రాసం ఇబ్బందులు లేకుండా రైతులకు అవగాహన కల్పించాలని, వ్యవసాయానికి సంబంధించి కరువు పరిస్థితిలో ఆరుతడి పంటలు వేయాలని అవగాహన కల్పించాలన్నారు.

గ్రౌండ్ వాటర్ రోజు రోజుకు పడిపోతుండడంతో గ్రౌండ్ వాటర్ పెంచేందుకు ప్రత్యేక యాక్షన్ ప్లాన్ ద్వారా ముందుకు వెళ్లాలన్నారు. విబిజిరాంజీ ఉపాధి హామీ పథకం కింద ఇంకుడు గుంతలు తవ్వి, పడిన ప్రతి వర్షం చుక్క కాపాడుకోవాలన్నారు.

CH SRINIVAS, HUSNABAD

CH SRINIVAS, HUSNABAD

Next Story