Husnabad: ఘనంగా పండిట్ జవహర్‌లాల్ నెహ్రూ 137వ జయంతి వేడుకలు

Husnabad: హుస్నాబాద్‌లోని నెహ్రూ చౌరస్తాలో మున్సిపల్ మరియు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జవహర్‌లాల్ నెహ్రూ 137వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించి నివాళులర్పించారు.

CH SRINIVAS, HUSNABAD
Published on: 14 Nov 2026 11:14 PM IST
Husnabad
X

Husnabad: ఘనంగా పండిట్ జవహర్‌లాల్ నెహ్రూ 137వ జయంతి వేడుకలు

హుస్నాబాద్: భారత తొలి ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ 137వ జయంతి సందర్భంగా హుస్నాబాద్ పట్టణంలోని నెహ్రూ చౌరస్తాలోని నెహ్రూ విగ్రహానికి మున్సిపల్ ఆధ్వర్యంలో, కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. నెహ్రూ చిత్రపటానికి పలువురు పూలమాలవేసి నివాళులర్పించారు. దేశానికి నెహ్రూ చేసిన సేవలను కొనియాడారు.

ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ దండిలక్ష్మి, మున్సిపల్ వైస్ చైర్ పర్సన్ చిత్తారిపద్మ, సింగిల్ విండో చైర్మన్ బొలిశెట్టి శివయ్య, కౌన్సిలర్స్ గాదపాక రవీందర్, పూదరి వరప్రసాద్, బొలిశెట్టి రాజు, పిల్లి తిరుపతి, బొల్లి శ్రీనివాస్, కేశవేణి రమేష్, సావుల మంజుల, బత్తుల స్వరూప, వైద్యం కిరణ్ కుమార్, అనూష విద్యాసాగర్, కో ఆప్షన్ మెంబర్స్ పున్నలావణ్య సది, పట్టణ అధ్యక్షులు వివి రమణ, మండల అధ్యక్షుడు వెన్నరాజు, మాజీ ఎంపీపీ ఆకుల వెంకట్, మాజీ జిల్లా గ్రంథాలయం చైర్మన్ కేడమ్ లింగమూర్తి, నాయకులు చిత్తారి రవీందర్, మార్క్ అనిల్ గౌడ్, ముప్పిడి రాజిరెడ్డి, గుర్రాల లింగారెడ్డి, సంజీవరెడ్డి, రమేష్ నాయక్, రాములు. చావుల రాజయ్య, కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

CH SRINIVAS, HUSNABAD

CH SRINIVAS, HUSNABAD