Husnabad: హుస్నాబాద్‌లో పోలీస్ అమరవీరుల సంస్మరణ సైకిల్ ర్యాలీ!

Husnabad: సిద్దిపేట జిల్లా హుస్నాబాద్‌లో ఏసీపీ సదానందం ఆధ్వర్యంలో పోలీస్ అమరవీరుల సంస్మరణ సైకిల్ ర్యాలీ జరిగింది. విధి నిర్వహణలో ప్రాణాలు అర్పించిన అమరులకు ఘన నివాళులర్పించారు.

CH SRINIVAS, HUSNABAD
Published on: 27 Oct 2026 6:35 PM IST
Husnabad
X

Husnabad: హుస్నాబాద్‌లో పోలీస్ అమరవీరుల సంస్మరణ సైకిల్ ర్యాలీ!

హుస్నాబాద్‌: సిద్దిపేట జిల్లా హుస్నాబాద్‌లో పోలీస్ అమరవీరుల సంస్మరణ వారోత్సవాల్లో భాగంగా సైకిల్ ర్యాలీ నిర్వహించారు. హుస్నాబాద్ ఏసీపీ సదానందం ఆధ్వర్యంలో ఏసీపీ కార్యాలయం నుంచి అంబేద్కర్ విగ్రహం వరకు సైకిల్ ర్యాలీ చేపట్టారు. విధి నిర్వహణలో ప్రాణాలర్పించిన పోలీస్ అమరవీరుల త్యాగాలను స్మరించుకుంటూ, వారి సేవలను ప్రజలకు తెలియజేసే ఉద్దేశంతో ఈ కార్యక్రమం నిర్వహించారు.

పోలీస్ అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయమని, ప్రజల భద్రత కోసం పోలీసులు అందిస్తున్న సేవలను ప్రతి ఒక్కరూ గుర్తించాలని ఈ సందర్భంగా పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో హుస్నాబాద్ సీఐ ఎస్ఐ అక్కన్నపేట ఎస్సై కోహెడ ఎస్సై కానిస్టేబుల్ పాల్గొన్నారు.

CH SRINIVAS, HUSNABAD

CH SRINIVAS, HUSNABAD