Husnabad: 'సఫాయి అప్నా బీమారీ బగావో': స్వచ్ఛతపై చైర్‌పర్సన్ పిలుపు!

Husnabad: హుస్నాబాద్ 1వ వార్డులో మున్సిపల్ చైర్‌పర్సన్ దండి లక్ష్మి ఆధ్వర్యంలో పరిశుభ్రత కార్యక్రమం. తడి, పొడి చెత్తను వేరు చేయాలని ప్రజలకు పిలుపు.

SRINIVAS, HUSNABAD
Published on: 17 July 2026 3:26 PM IST
Husnabad
X

Husnabad: 'సఫాయి అప్నా బీమారీ బగావో': స్వచ్ఛతపై చైర్‌పర్సన్ పిలుపు!

Husnabad: సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పట్టణంలో పురపాలక సంఘ చైర్ పర్సన్ శ్రీమతి దండి లక్ష్మి ఆధ్వర్యంలో ఒకటో వార్డు నేతాజీ నగర్ లో సఫాయి అప్నా భీమారీ బగావో అనే కార్యక్రమము చేయడం జరిగింది. చైర్ పర్సన్ మాట్లాడుతూ పట్టణ ప్రజలందరూ వ్యక్తిగత శుభ్రతను పాటించాలని, ఇంటి చుట్టూ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని, నిల్వ ఉన్న నీటిని ఎప్పటికప్పుడు తొలగించుకోవాలని, పాత టైర్లలో, కుండ లలో రంజాన్లలో నీరు నిలవ లేకుండా చూసుకోవాలని, చేతులను పరిశుభ్రంగా కడుకోవాలని,

ఇంటి పరిసరాలలో రైన్ వాటర్ హార్వెస్టింగ్ సిస్టమ్స్ ను ఏర్పాటు చేసుకోవాలని, చెత్తను వేరు చేసి మున్సిపల్ వాహనానికి అందించాలని, ప్రజలందరూ ఆరోగ్యంగా ఉండాలని, స్వచ్ఛతను పాటించాలని తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో వైస్ చైర్ పర్సన్ చిత్తారి పద్మ , కౌన్సిలర్లు అనూష , కేశవేణి రమేష్ , శానిటరీ ఇన్స్పెక్టర్ బాల ఎల్లం, ఎన్విరాన్మెంటల్ ఇంజనీర్ రవి కుమార్, జవాన్ ప్రభాకర్,శ్రీకాంత్, ప్రజా ప్రతినిధులు మరియు సిబ్బంది పాల్గొన్నారు.

SRINIVAS, HUSNABAD

SRINIVAS, HUSNABAD

Next Story