Husnabad: నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పన పూరెళ్ల శ్రవణ్ కుమార్
Husnabad: హుస్నాబాద్ నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలే లక్ష్యంగా పనిచేస్తానన్న టీఆర్ఎస్ పార్టీ ఇన్‌చార్జి పూరెళ్ల శ్రవణ్ కుమార్. జాబ్ మేళాలు, ఉచిత మెటీరియల్ పంపిణీ.
Husnabad: నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పన పూరెళ్ల శ్రవణ్ కుమార్
హుస్నాబాద్: హుస్నాబాద్ నియోజకవర్గ నిరుద్యోగ యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలే లక్ష్యంగా పనిచేస్తానని తెలంగాణ రక్షణ సేన పార్టీ హుస్నాబాద్ నియోజకవర్గ నూతన ఇన్‌చార్జి పూరెళ్ల శ్రవణ్ కుమార్ అన్నారు. తొలి పర్యటనలో భాగంగా సిద్దిపేట జిల్లా కోహెడలో పార్టీ జెండా పండుగలో పాల్గొని, అనంతరం హుస్నాబాద్ లో అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించి మీడియాతో మాట్లాడారు.
తెలంగాణ రక్షణ సేన పార్టీ చీఫ్ కల్వకుంట్ల కవిత తనపై ఉంచిన నమ్మకానికి కృతజ్ఞతలు తెలిపిన పూరెళ్ల శ్రవణ్ కుమార్... హుస్నాబాద్ నియోజకవర్గ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడమే తన ప్రధాన లక్ష్యమన్నారు. బీటెక్, ఎం టెక్ పూర్తి చేసిన విద్యార్థుల నుంచి ప్రత్యేక ఈ-మెయిల్ ద్వారా రెజ్యూములు స్వీకరించి, వారి అర్హతలకు అనుగుణంగా కంపెనీలతో అనుసంధానం చేస్తామని,
పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న నిరుపేద విద్యార్థులకు హైదరాబాద్ స్థాయి స్టడీ మెటీరియల్‌ను ఉచితంగా అందించే కార్యక్రమాన్ని చేపడతామని తెలిపారు. అలాగే ఉద్యోగ అవకాశాల కోసం జాబ్ మేళాలు నిర్వహించి, టెక్నికల్ ఉద్యోగాలు పొందేందుకు యువతకు పూర్తి సహకారం అందిస్తామని అన్నారు.




